లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఈవో...

సస్పెండ్ అయిన అర్చకుడిని విధుల్లోకి తీసుకునేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన పెద్దమ్మ గుడి ఈవో అంజనా రెడ్డి... లంచం తీసుకుంటుండగా రైడ్ చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 9:12 PM IST
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఈవో...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఈవో... సస్పెండ్ అయిన అర్చకుడి నుంచి
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 9:12 PM IST
హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం పెద్దమ్మ గుడి ఈవో అంజనా రెడ్డి, అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. సస్పెండ్ అయిన ఓ అర్చకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు అంజనా రెడ్డి. కొన్నిరోజుల క్రితం క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఓ అర్చకుడిని గుడి విధుల నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రూ.5 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు ఈవో అంజనారెడ్డి. చివరికి రూ.4 లక్షలు ఇస్తే, సస్పెన్షన్ ఎత్తివేసేందుకు అంగీకరించాడు ఈవ అంజనారెడ్డి. అయితే ఈ విషయం తెలిసిన సిబ్బంది, అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందించారు. మంగళారం అర్చకుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆకస్మాత్తుగా దాడి చేసిన ఏసీబీ అధికారులు... అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

peddamma temple, peddamma temple eo, anjana reddy, anjana reddy caught by acb, acb, ఏసీబీ, అంజనా రెడ్డి, పెద్దమ్మ ఆలయం, పెద్దమ్మ ఆలయ ఈవో
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పెద్దమ్మ ఆలయ ఈవో అంజనా రెడ్డి


హైదరాబాద్ నగరంలో నిత్యం భక్తుల రద్దీతో బిజీగా ఉండే పెద్దమ్మ గుడిలో ఇలాంట పనులు వెలుగుచూడడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...