కనిష్క భర్త, సాఫ్టవేర్ ఇంజినీర్ అయిన విజయ్ కుమార్ ఉన్నట్లు సమాచారం. విజయ్ కుమారే తన భార్యతో ఇలా హనీ ట్రాప్ చేసి.. బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తేలింది.
హైదరాబాద్‌లో జరిగిన ఓ హనీ ట్రాప్ వెలుగులోకి జరిగింది. వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టస్ వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా తెరపైకి వచ్చింది. ఓ రిసార్ట్‌కు పిలిపించి వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టస్ కనిష్క గడిపిన దృశ్యాలు సెల్ ఫోన్లో రికార్డు చేసింది. ఆ తర్వాత వాటిని చూపిస్తూ అతడ్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వ్యవహారంలో కనిష్క భర్త కూడా ఆమెకు సహకరించాడు. ఓ రిసార్ట్‌కు పిలిపించి వ్యాపారవేత్తపై గన్ పెట్టి బెదిరించారు. ఆ తర్వాత అతడి నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా కోటిరూపాయల బాండ్ కూడా రాయించుకున్నారు. దీంతో వ్యాపారవేత్త సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం వెనుక కనిష్క భర్త, సాఫ్టవేర్ ఇంజినీర్ అయిన విజయ్ కుమార్ ఉన్నట్లు సమాచారం. విజయ్ కుమారే తన భార్యతో ఇలా హనీ ట్రాప్ చేసి.. బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తేలింది.డబ్బున్న వ్యాపార వేత్తలే టార్గెట్‌గా విజయ్ కుమార్ ఈ వ్యవహారాలన్ని నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది.