హోమ్ /వార్తలు /క్రైమ్ /

టిక్‌టాక్ చూడొద్దన్నందుకు యువతి సూసైడ్.. హైదరాబాద్‌లో విషాదం..

టిక్‌టాక్ చూడొద్దన్నందుకు యువతి సూసైడ్.. హైదరాబాద్‌లో విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రామంతాపూర్‌ ప్రాంతానికి చెందిన యువతి(17) ఫోన్‌లో టిక్‌టాక్‌ చూస్తూ గడిపేస్తోంది. ఆటలు ఆడుతూ ఉంటోంది.

టిక్‌టాక్ వ్యసనం ప్రాణాలను తీస్తోంది. ఇప్పటికే దాని ప్రభావంతో చాలా మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇప్పుడు మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎప్పుడూ టిక్‌టాక్‌తోనే సమయం గడిపేయడంతో మందలించినందుకు సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రామంతాపూర్‌ ప్రాంతానికి చెందిన యువతి(17) ఫోన్‌లో టిక్‌టాక్‌ చూస్తూ గడిపేస్తోంది. ఆటలు ఆడుతూ ఉంటోంది. అది గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి గురువారం ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime, Hyderabad news, Telangana News, Tiktok

ఉత్తమ కథలు