హైదరాబాద్ నగర శివార్లలో ఓ బాలిక కనిపించకుండా పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్ కుంట్లూరుకు చెందిన ఆమె ఫిబ్రవరి 18 తేదీ నుంచి కనిపించకుండా పోయింది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి వెళ్తున్నట్టు లెటర్ రాసి పెట్టింది. వివరాలు.. కుంట్లూరులో నివాసం ఉండే బాలిక హయత్‌నగర్‌లో ఓ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదువతోంది. అయితే ఫిబ్రవరి 18న కిరాణం షాప్‌కు వెళ్తున్నానని చెప్పిన బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఇక, బాలిక అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యాదయ్యతో కలిసి కారులో వెళ్లిందని స్థానికులు తమకు చెప్పారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బాలిక ఇంటికి రాకపోవడం, ఎక్కడుందో తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సబందించి కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించడానికి సిబ్బందిని పంపినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇక, బాలికకు అదే కాలనీకి యాదయ్యతో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో బాలిక లెటర్ కూడా రాసి పెట్టింది. "నాకు యాది అంకుల్ అంటే ఇష్టం. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అతను లేకుండా నేను ఉండలేను" అని బాలిక పేర్కొంది. అలాగే అందులో చాలా విషయాలను ప్రస్తావించింది. ఐయామ్ సారీ అమ్మ.. దయచేసి తనను అర్థం చేసుకోవాలంటూ తల్లిని కోరింది. ఇక, నిందితుడు యాదయ్య కూడ ా 10 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతనికి భార్య ముగ్గురు కూతుళ్లున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad