డెంగ్యూని అడ్డుపెట్టుకుని దోపిడీ.. మీరు జాగ్రత్త..

డెంగ్యూతో బాధపడే చిన్నారులకు సాయం చేసేందుకు ఈ అకౌంట్‌ను ఓపెన్ చేశామని, దాతలు ముందుకొచ్చి వారికి సహకరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు.

news18-telugu
Updated: September 19, 2019, 7:09 PM IST
డెంగ్యూని అడ్డుపెట్టుకుని దోపిడీ.. మీరు జాగ్రత్త..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రస్తుతం తెలంగాణలో వైరల్ జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అయితే, డెంగ్యూని అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున దోచుకునేందుకు ఓ యువకుడు ప్లాన్ చేశాడు. ఈనెల 12న గడ్డం క్రాంతి కుమార్ అనే వ్యక్తి యాక్సిస్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అపోలో ఆస్పత్రి పేరుతో ఆ అకౌంట్ ఓపెన్ చేయాలన్నాడు. డెంగ్యూతో బాధపడే చిన్నారులకు సాయం చేసేందుకు ఈ అకౌంట్‌ను ఓపెన్ చేశామని, దాతలు ముందుకొచ్చి వారికి సహకరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అపోలో ఆస్పత్రి పేరు కనిపించగానే కొందరు స్పందించారు. అయితే, బ్యాంక్ సిబ్బంది క్రాస్ చెక్ చేసుకునే సమయంలో అసలు విషయం వెలుగుచూసింది. అపోలో ఆస్పత్రి పేరుతో తమకు లెటర్ హెడ్ వచ్చిందంటూ బ్యాంక్ సిబ్బంది హాస్పటల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే, అదంతా అవాస్తవమంటూ అపోలో యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో గడ్డం క్రాంతి కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్‌లో కేవలం రూ.1000 మాత్రమే వచ్చాయి.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు