ఇంజనీరింగ్ చదవాల్సినోడు.. దారి తప్పి ఇలా తయారయ్యాడు..

టాస్క్‌ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్య కుమార్ నేత్రుత్వంలో అతని కదలికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 53.4గ్రా. బంగారు ఆభరణాలు, ఒక కేజీ వెండి, రూ.22లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

news18-telugu
Updated: May 12, 2019, 4:31 PM IST
ఇంజనీరింగ్ చదవాల్సినోడు.. దారి తప్పి ఇలా తయారయ్యాడు..
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)
news18-telugu
Updated: May 12, 2019, 4:31 PM IST
ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు.. ఈజీ మనీ కోసం ఇళ్లల్లో చోరీలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్ పరిధిలోని పలు స్టేషన్ల పరిధిలో అతనిపై కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.22లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అమంగల్ గ్రామానికి చెందిన నేనావత్ వినోద్ కుమార్‌ ఇబ్రహీంపట్నంలోని ఏవీఎన్ కాలేజీలో ఇంజనీరింగ్‌లో చేరాడు. కానీ మధ్యలోనే చదువు ఆపేసి చోరీలకు అలవాటుపడ్డాడు. గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్‌లు నమోదయ్యాయి. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించి గతేడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యాడు. విడుదల తర్వాత కూడా దొంగతనాలు మానని వినోద్ కుమార్.. మరో 14ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆయా ఇళ్లల్లో చోరీ చేసిన బంగారాన్ని గుజరాత్‌కు చెందిన బంగారం వ్యాపారి మదన్‌కుమార్‌కు విక్రయించాడు.టాస్క్‌ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్య కుమార్ నేత్రుత్వంలో అతని కదలికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 53.4గ్రా. బంగారు ఆభరణాలు, ఒక కేజీ వెండి, రూ.22లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...