హైదరాబాద్‌లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ పార్టీని పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు.రాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫుడింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడులు చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. అయితే పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది.
నిందితుల్లో ప్రముఖ ర్యాప్ సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అరెస్టయిన వారిలో 95 మంది పురుషులు, 39 మంది మహిళలు, యజమానులు కూడా ఉన్నారు. అరెస్టయిన వారిలో ప్రముఖ గాయని, ప్రముఖ కుటుంబానికి చెందిన ఒక మహిళ, ఈ ఏడాది మొదట్లో అరంగేట్రం చేసిన హీరోతో పాటు ఇటీవల రిటైర్డ్ అయిన ఒక పెద్ద అధికారి కూతురు, మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
నాగబాబు కూతురు నిహారిక కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నట్టు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. పలు టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్న వీడియోల్లో కూడా నిహారిక కనిపిస్తోంది. నిహారిక పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం బయటకు వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే అదుపులో ఉన్న యువతీయువకుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు నిహారికకు, రాహుల్ సిప్లిగంజ్‌కు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టినట్లు సమాచారం. మరోసారి స్టేషన్‌కు విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది.
ఈ రేవ్ పార్టీలో ఎల్ఎస్డి, గంజాయి, కొకైన్ మరియు మరికొన్ని డ్రగ్స్‌తో కూడిన సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులను చూసి కొందరు పబ్ కిటికీల నుంచి డ్రగ్ ప్యాకెట్లను విసిరేందుకు ప్రయత్నించారు. ఆ ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆ శాఖ ప్రయత్నిస్తోంది. పబ్ యజమానులపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs case, Nagababu, Niharika chitanya, Niharika konidela