Suicide In Tirumala: తిరుమల అతిథి గృహంలో హైదరాబాద్ భక్తుడి ఆత్మహత్య

తిరుమలలో ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వకులమాత అతిథి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

news18-telugu
Updated: November 21, 2020, 7:54 PM IST
Suicide In Tirumala: తిరుమల అతిథి గృహంలో హైదరాబాద్ భక్తుడి ఆత్మహత్య
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
తిరుమలలో ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వకులమాత అతిథి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతున్ని హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి చెందిన శ్రీధర్‌(40)గా గుర్తించారు. వివరాలు.. శ్రీదర్ ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీధర్ శుక్రవారం తిరుమలకు వెళ్లాడు. తిరుమలలోని వకుళమాత అతిథి గృహంలోని 511 నెంబర్‌ గదిలో బస చేశాడు. అయితే ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు శ్రీధర్‌కు ఫోన్ చేస్తే అతడు స్పందించలేదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో కుటుంబసభ్యులు టీటీడీ అధికారులను సంప్రదించలేదు. ఇక, మరోవైపు శ్రీధర్ గది ఖాళీ చేయాల్సిన సమయం దాటిపోవడంతో సిబ్బంది తలుపు కొట్టారు. అయినా లోపలి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. తలుపులు పగలగొట్టారు. అప్పటికే శ్రీధర్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు.

దీంతో టీటీడీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఇక, తొలుత తన అల్లుడితో కలిసి తిరుమల వెళ్లాలని భావించిన శ్రీదర్.. చివరికి మాత్రం అతనొక్కడే తిరుమలకు వెళ్లాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading