మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసిన ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెను మాయ మాటలతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు.. పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. తప్పుడు వివరాలతో రూ. 10 లక్షల టోకరా వేశాడు. వివరాలు.. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన ఓ సైబర్ నేరగాడు.. మొహల్కుమార్ అనే పేరుతో తనను పరిచయం చేసుకున్నాడు. తనది గుజరాత్ అని.. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇలా వారిద్దరి మధ్య పరియం పెరిగింది.
కొంతకాలంగా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్లో ఉన్న తన ఇంటి రిపేర్ కోసం డబ్బులు అసరమున్నాయని.. మేస్త్రి ఖాతాలో కన్ని డబ్బులు జామా చేయాలని సైబర్ నేరగాడు ఆ యువతిని కోరాడు. తిరిగి ఇండియాకు వచ్చాక ఆ డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. ఈ మాటలు నమ్మిన యువతి.. అతడు చెప్పిన ఖాతాలోకి డబ్బు పంపించింది. ఇక, ఆ తర్వాత సైబర్ నేరగాడు మరో ప్లాన్ వేశాడు. పెళ్లి తర్వాత ఆమెను అమెరికా తీసుకెళ్లడానికి ఇప్పటి నుంచే వీసా ప్రాసెస్ మొదలు పెడితే బాగుంటుందని నమ్మించాడు. ఇందుకు సంబంధించి ఓ నెంబర్ ఇచ్చి.. వారిని సంప్రదించాలని సూచించాడు. దీంతో ఆ యువతి అలాగే చేసింది. వీసా ప్రాసెసింగ్ కోసం వారు డబ్బులు అడగడంతో.. రూ. 4 లక్షలు వారు చెప్పిన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసింది.
ఇక, ఇది జరిగిన వారానికి తాను ఇండియా వస్తున్నట్టు సైబర్ నేరగాడు యువతికి చెప్పాడు. నేరుగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు నమ్మించాడు. ఇక, ఎయిర్పోర్ట్ నుంచి ఆమెకు ఫోన్ చేసి.. కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన వద్ద 50 వేల డాలర్లు ఉన్నందున.. జరిమానా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్పారు. ఇలా చెప్పి ఆ యువతి దగ్గర నుంచి రూ. 6 లక్షలు దోచేశాడు. ఆ తర్వాత కూడా డబ్బులు అడగటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.