ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య డేటా చోరీ వివాదం... అసలేం జరిగింది?

భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని గుంటూరులో ఐటీ గ్రిడ్ బ్రాంచ్ యాజమాన్యం ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓటర్ల డేటా చౌర్యం కేసు విచారణలో భాగంగా తాము భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: March 3, 2019, 3:23 PM IST
ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య డేటా చోరీ వివాదం... అసలేం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, విజయవాడ ప్రతినిధి)

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఓటర్ల డేటా చోరీ కేసు కుదిపేస్తోంది. ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు లక్షలాది మంది డేటాను సేకరించి హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్ ఆఫ్ ఇండియా, బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ వంటి ఐటీ సంస్ధలకు ఇచ్చారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.

ఏపీలోని ఓటర్ల డేటాతో పాటు వారి ఆధార్, ఇతర వివరాలను ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డేటా గ్రిడ్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిందన్న ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని గుంటూరులో ఐటీ గ్రిడ్ బ్రాంచ్ యాజమాన్యం ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓటర్ల డేటా చౌర్యం కేసు విచారణలో భాగంగా తాము భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు. భాస్కర్‌ను తమకు అప్పగించాలని ఏపీ పోలీసులు కోరారు. అయితే తెలంగాణ పోలీసులు దీనికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

అటు డేటా చౌర్యం కేసు దర్యాప్తులో భాగంగా డేటా గ్రిడ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారిని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్ ఆఫ్ ఇండియా వ్యవస్ధాపకుడు దాకవరపు అశోక్ పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. డేటా గ్రిడ్ తో పాటు కూకట్ పల్లిలోని బ్లూ వేల్ టెక్నాలజీస్ సంస్ధ కార్యాకలాపాలపైనా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టిసారించారు. దీంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీకి సాయం చేస్తున్న ఐటీ కంపెనీలే టార్గెట్ గా సాగుతున్న ఈ కేసు దర్యాప్తుపై ఏపీ టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఏపీ టీడీపీ తరఫున తెలంగాణలో పనిచేస్తున్న ఐటీ కంపెనీలపై సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు రాజకీయ రంగు పులుముకున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం కావాలనే తమకు సాయం చేస్తున్న ఐటీ కంపెనీలపై దాడులు చేయిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నిన్న కోడుమూరు సభలో ఆరోపించగా... ఆయన తనయుడు లోకేష్... వైసీపీ, టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. ఈ వ్యవహారం రాజకీయంగా ఇరు రాష్ట్రాల్లోనూ ప్రక్రంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల వేళ ఇది ఎక్కడికి పోతుందో అన్న అనుమానం టీడీపీలో వ్యక్తమవుతోంది.
Published by: Sulthana Begum Shaik
First published: March 3, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading