HYDERABAD CYBER CRIME POLICE GIVES AWARENESS TO NETIZENTS ABOUT THIS FRAUD BY USING JATHI RATNALU MOVIE MEME SRD
Cyber Crime : వీడియో కాల్ కావాలా నాయనా..ఈ మాటకు అసలు టెంప్ట్ అవ్వొద్దు.! కక్కుర్తి పడ్డారా ఇక అంతే..
ప్రతీకాత్మక చిత్రం
Cyber Crime : సైబర్ క్రైమ్స్ గురించి పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. చైతన్యం కల్పిస్తున్నారు. అపరిచితుల నుంచి కాల్స్, మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే పోలీసుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. ఇన్ని హెచ్చరికలు చేస్తున్నా, జాగ్రత్తలు చెబుతున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి దగా పడుతున్నారు. జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీ పెరిగిందని సంతోషించే లోపే దానివల్ల జరుగుతోన్న మోసాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్లో బ్లాక్ మెయిల్లు, హనీ ట్రాప్‌లు బాగా పెరిగిపోతున్నాయి. నగ్న వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కు దిగుతోన్న ఉదాంతాలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. ఓ వైపు పోలీసులు, మీడియా ఇలాంటి వాటికి దూరంగా ఉండండని చెబుతున్నా. కొందరు మాత్రం కక్కుర్తి పడి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సైబరాబాద్ పోలీసులు ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహన పెంచేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.
ప్రజలకు విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ఇటీవల హైదరాబాద్ పోలీసులు సినిమాలను సైతం వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆన్లైన్ వేదికగా అమ్మాయి అంటూ పరిచయం చేసుకొని చేస్తోన్న మోసాలకు సంబంధించి అవగాహన కోసం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్‌ను చేశారు. ఈసారి పోలీసులు ఇందుకోసం జాతి రత్నాలు సినిమాను ఉపయోగించుకున్నారు. ఇందులో రాహుల్ రామకృష్ణ.. నవీన్ పొలిశెట్టితో మాట్లాడుతూ.. "మామ ఈ పిల్ల ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. వాట్సాప్‌లో వీడియో కాల్ మాట్లాడుకుందాం అంటుంది` అని అంటాడు. దానికి నవీన్ పొలిశెట్టి స్పందిస్తూ.. `వద్దు మామ.. జోగిపేట రాజేశ్ గాడు ఇట్టనే బట్టలు లేకుండా వీడియో కాల్ మాట్లాడిండు.. దాన్ని రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన డబ్బులు గుంజిర్రు" అని చెబుతాడు.
— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) June 10, 2021
ఇలా రూపొందించిన మీమ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పోలీసులు "ఇలాంటి వారితో.. తస్మాత్ జాగ్రత"అంటూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. సైబర్ క్రైమ్స్ గురించి పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. చైతన్యం కల్పిస్తున్నారు. అపరిచితుల నుంచి కాల్స్, మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే పోలీసుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. ఇన్ని హెచ్చరికలు చేస్తున్నా, జాగ్రత్తలు చెబుతున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.