శంషాబాద్‌లో మళ్లీ పట్టుబడ్డ బంగారం.. కుక్కర్‌లో తరలిస్తుండగా..

Gold smuggling Shamshabad : ఇందులో XY235 విమానం ద్వారా శంషాబాద్‌లో అడుగుపెట్టిన ప్రయాణికుడి నుంచి 250గ్రా. బరువున్న రెండు బంగారం బిస్కెట్లు, 50 గ్రా. బరువున్న మరో రెండు బంగారు బిస్కెట్లు జప్తు చేశారు.

news18-telugu
Updated: March 23, 2019, 1:37 PM IST
శంషాబాద్‌లో మళ్లీ పట్టుబడ్డ బంగారం.. కుక్కర్‌లో తరలిస్తుండగా..
పట్టుబడ్డ బంగారం..
news18-telugu
Updated: March 23, 2019, 1:37 PM IST
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి రూ.26లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో XY235 విమానం ద్వారా శంషాబాద్‌లో అడుగుపెట్టిన ప్రయాణికుడి నుంచి 250గ్రా. బరువున్న రెండు బంగారం బిస్కెట్లు, 50 గ్రా. బరువున్న మరో రెండు బంగారు బిస్కెట్లు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ రూ.19,83,600 ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రిల్లింగ్ మెషీన్‌లో అక్రమంగా ఈ బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

ఇక దుబాయ్ నుంచి 6E-025 విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ. 7,05,690 విలువ చేసే 219గ్రా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రావెల్ కుక్కర్ కింది భాగంలో ఈ బంగారాన్ని అమర్చి అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారంతో పట్టుబడ్డ ఇద్దరు ప్రయాణికులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...