Home /News /crime /

HYDERABAD CP SAJJANAR EXPLAINS PRIYANKA REDDY RAPE AND MURDER CASE SK

షాద్‌నగర్ లైంగికదాడి.. ఆ నలుగురే హత్య చేశారు.. అంతా ప్లాన్ ప్రకారమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏ 1. మహమ్మద్ అలియాస్ ఆరిఫ్ ( 26), ఏ2. జొల్లు శివ 20 క్లీనర్, ఏ3. జొల్లు నవీన్ (20), ఏ4. చెన్నకేశవులు (20)పై చార్జిషీట్ దాఖలు చేశామని సైబారాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. నలుగురూ నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన వారని తెలిపారు.

ఇంకా చదవండి ...
  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఆమెను రేప్ చేసి చంపేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.  ఏ 1. మహమ్మద్ అలియాస్ ఆరిఫ్-లారీ డ్రైవర్ ( 26),  ఏ2. జొల్లు శివ- లారీ క్లీనర్ (20), ఏ3. జొల్లు నవీన్ -లారీ క్లీనర్ (20),  ఏ4. చెన్నకేశవులు-లారీ డ్రైవర్ (20)పై చార్జిషీట్ దాఖలు చేశామని సైబారాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరంతా  నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన వారని తెలిపారు.  లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియాంక రెడ్డి ట్రాప్ చేసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని వెల్లడించారు.

  పోలీసుల ప్రెస్ మీట్


  ప్రియాంక హత్య కేసు వివరాలు సీపీ సజ్జనార్ మాటల్లోనే..

  నవంబరు 28 రాత్రి శంషాబాద్ పీఎస్‌కు కంప్లైంట్ వచ్చింది. ప్రియాంక రెడ్డి తొండుపల్లి టోల్ ప్లాజా నుంచి గచ్చిబౌలికి వెళ్లి వచ్చిన తర్వాత మిస్సింగ్ తల్లిదండ్రులు అని చెప్పారు.  ఆ తర్వాతి రోజు ఉదయం షాద్ నగర్ సమీపంలో ఓ మహిళ మృతదేహం తగలబడుతోందని సమాచారం వచ్చింది. వెంటనే ప్రియాంక పేరెంట్స్‌కు చెప్పాం. వారు అక్కడికి చేరుకొని అది ప్రియాంక మృతదేహమే అని గుర్తుపట్టారు. దాంతో వెంటనే 10 టీమ్స్ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించాం.

  28న శంషాబాద్ టోల్ గేట్ వద్ద లారీ ఆపారు. లారీలో ఐరన్ మెటీరియల్‌ను హైదరాబాద్‌లో అన్‌లోడింగ్ చేసేందుకు వెళ్లారు. ఐతే ఐరన్ మెటిరియల్ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టోల్ ప్లాజ్ దగ్గర పక్కకు లారీని ఆపారు. కాసేపటికి  ప్రియాంక  టోల్ ప్లాజా దగ్గర బైక్ ఆపడం వారందరూ చూశారు. ఆ తర్వాత మందు తాగి ఆమె గురించి చర్చించుకున్నారు. మళ్లీ ఇక్కడికే వస్తుందని పట్టుకుందామని మాట్లాడుకున్నారు.  స్కూటీలో గాలి తీసేయాలని నవీన్ ఐడియా ఇచ్చి.. టైర్‌లో గాలి తీశాడు. రాత్రి 09.18కి ప్రియాంక తిరిగి టోల్ ప్లాజాకు వచ్చింది. మీ వాహనం పంక్చర్ అయిందని..మేం చేయించుకు వస్తామని మహ్మద్ చెప్పాడు. వాళ్లను నమ్మి ప్రియాంక వాహనం ఇచ్చింది.  పంక్చర్ వేసుకొని వస్తానని చెప్పి శివ వాహనాన్ని తీసుకెళ్లాడు.  కొద్ది సేటి తర్వాత వచ్చి షాపు క్లోజ్ ఉందని తిరిగి వచ్చాడు.  రాత్రి 9:28కి  వేరొక షాప్‌కు వెళ్తానని చెప్పివెళ్లి గాలి కొట్టించుకొని వచ్చాడు. 09.22కి చెల్లికి ప్రియాంక ఫోన్ చేసింది.  ఆ తర్వాత మహ్మద్, నవీన్, కేశవులు ప్రియాంకను ఎత్తుకొని గోడ చాటుకు తీసుకెళ్లారు. అందరూ కలిసి అత్యాచారం చేసి.. నోరు, ముక్కును మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. 09.50కి ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చింది. రాత్రి 10.08కి ప్రియాంక రెడ్డి చనిపోయింది.

  రాత్రి 10.30 సమయంలో ఆమె మృతదేహాన్ని లారీని తీసుకెళ్లారు. మహ్మద్, చెన్నకేశవులు లారీలో వెళ్లగా..  శివ, నవీన్  వెనకాల బైక్ పై ఫాలో అయ్యారు.  హైవేపై ఇక చోట బాటిల్‌లో పెట్రోల్ తీసుకున్నారు.  అర్ధరాత్రి 2.30 గంటలకు బాడీని దుప్పటిలో చుట్టి షాద్ నగర్ శివారులోని చటాన్ పల్లిలో బ్రిడ్జి కింద తగులబెట్టారు.   మృతదేహం పూర్తిగా కాలిందా లేదా అని మరోసారి వచ్చి చెక్ చేసుకున్నారు. ఆ తర్వాత బైక్‌ను కొత్తూరు సమీపంలో వదిలి  అరాంఘర్‌కి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఐరన్ మెటీరియల్ ఇవ్వాల్సిన చోటుకు వెళ్లి.. అన్‌లోడింగ్ చేసి వెళ్లిపోయారు.  ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్‌కి అప్పగించి త్వరగా శిక్షపడేలా చూస్తాం. బయటకు వెళ్లినప్పుడు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 చేయండి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Telangana

  తదుపరి వార్తలు