మూడు బృందాలతో కోడెల మృతిపై దర్యాప్తు.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..

కోడెల శివప్రసాదరావుది హత్యా? ఆత్మహత్యా? లేక గుండె పోటా? అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 16, 2019, 4:50 PM IST
మూడు బృందాలతో కోడెల మృతిపై దర్యాప్తు.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనది హత్యా? ఆత్మహత్యా? లేక గుండె పోటా? అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. కోడెల శివప్రసాదరావు మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, బంజారా హిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మూడు టీమ్‌లు దర్యాప్తు చేపడతాయని తెలిపారు. కోడెల మృతికి సంబంధించి ఏ చిన్న క్లూను కూడా వదలబోమని, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఆయన మరణానికి కారణం ఏమిటి విషయం పై క్లారిటీ వస్తుందని చెప్పారు.

అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నామని, మృతి జరిగిన స్థలం వద్ద ఇప్పటికే తమ క్లూస్ టీం మరియు టెక్నికల్ టీం ఆధారాలు సేకరిస్తోందని అంజనీ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క క్లూను తమ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు పంపి పక్కా నివేదిక తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...