హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: తెల్లవారుజామున పక్కింట్లో భర్త ఫోన్‌ అలారం మోగింది.. ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన భార్యకు...

Hyderabad: తెల్లవారుజామున పక్కింట్లో భర్త ఫోన్‌ అలారం మోగింది.. ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన భార్యకు...

రాహుల్ (ఫైల్ ఫొటో)

రాహుల్ (ఫైల్ ఫొటో)

రాహుల్(34), రమ్యశ్రీ భార్యాభర్తలు. వీరికి ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్ ప్లాట్ నెంబర్.214లో భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదని భార్యాభర్తలు కొంత కాలంగా చింతిస్తున్నారు. రాహుల్ మరింతగా మానసిక వేదనకు లోనయ్యాడు.

ఇంకా చదవండి ...

హైదరాబాద్: కొందరు దంపతులు పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగడం లేదని బాధపడుతుంటారు. పూజలు, వ్రతాలు మొదలుకుని ఆసుపత్రుల్లో కూడా పరీక్షలు చేయించుకుంటుంటారు. అయినప్పటికీ కొందరికి ఎలాంటి సమస్య లేకపోయినా పిల్లలు కలగడం ఆలస్యమవుతుంటుంది. ఈలోపు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి, సమాజం సూటిపోటి మాటలు అలాంటి దంపతులను కుంగదీస్తుంటాయి. కొందరు ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. సరిగ్గా.. అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్(34), రమ్యశ్రీ భార్యాభర్తలు. వీరికి ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్ ప్లాట్ నెంబర్.214లో భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదని భార్యాభర్తలు కొంత కాలంగా చింతిస్తున్నారు. రాహుల్ మరింతగా మానసిక వేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే.. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా పిల్లల విషయమై మాటలు నడిచాయి. సోమవారం ఈ విషయమై భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. భర్త రాహుల్‌ను డాక్టర్‌కు చూపించుకోవాలని భార్య రమ్యశ్రీ కోరింది. ఇద్దరూ కలిసి డాక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. బయటకు వెళ్లి వస్తానని రమ్యశ్రీకి చెప్పి రాహుల్ వెళ్లాడు. సోమవారం సాయంత్రం అనగా వెళ్లిన రాహుల్ అర్ధరాత్రి అవుతున్నా రాకపోవడంతో రమ్యశ్రీ కంగారుపడింది. రాహుల్‌ కోసం వెతికీవెతికీ ఎక్కడా కనిపించకపోవడంతో నిద్రపోకుండా రమ్యశ్రీ ఎదురుచూస్తూనే ఉంది.

మంగళవారం తెల్లవారుజామున రాహుల్, రమ్యశ్రీ ఉంటున్న పక్క పోర్షన్‌లో రాహుల్ ఫోన్ అలారం శబ్దం రమ్యశ్రీకి వినిపించింది. దీంతో.. గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న ఆ పోర్షన్‌లోకి హుటాహుటిన రమ్యశ్రీ వెళ్లి చూడగా.. రాహుల్ ఉరేసుకుని కనిపించాడు. సీలింగ్ హుక్కుకు చున్నీతో ఉరేసుకుని రాహుల్ కనిపించడంతో రమ్యశ్రీ హతాశురాలయింది. భర్తను విగతజీవిగా చూసిన రమ్యశ్రీ కన్నీరుమున్నీరయింది.

ఇది కూడా చదవండి: Black Fungus: బ్లాక్ ఫంగస్ ఎంతపని చేసింది.. హైదరాబాద్ సన్‌షైన్‌లో చేర్చారు.. చివరికి ఏమైందంటే..

ఆమె ఏడుపు విని ఇరుగుపొరుగు అక్కడికి వెళ్లి చూడగా రాహుల్ ఉరేసుకుని కనిపించాడు. దీంతో.. వారంతా షాక్‌కు లోనయ్యారు. రమ్యశ్రీని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మనస్తాపంతోనే రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని రమ్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. సంతానం లేదన్న దిగులు, సమాజం సూటిపోటి మాటలకు ఓ నిండు ప్రాణం బలయిపోయింది.

First published:

Tags: Crime news, Husband commits suicide, Hyderabad, Kukatpally

ఉత్తమ కథలు