విద్యార్థినిపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం..

Police Constable Paramesh Suspension | శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతితో హేయంగా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.

news18-telugu
Updated: August 1, 2019, 3:39 PM IST
విద్యార్థినిపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం..
సస్పెన్షన్‌కు గురైన పోలీస్ కానిస్టబుల్ పరమేశ్
  • Share this:
యునానీ ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చార్మినార్ వద్ద బుధవారం కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థిని పట్ల సివిల్ డ్రెస్‌లో ఉన్న పరమేశ్ అనే పోలీస్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను గిల్లిన దృశ్యాలు పలు ఛానళ్లలోనూ ప్రసారం అయ్యాయి. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే అతడు అలా ప్రవర్తించాడని మహిళా సంఘాలు మండిపడ్డాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతితో హేయంగా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పరమేశ్..


దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఘటనపై సీరియస్ అయ్యారు. విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిందుకు అతన్ని సస్పెండ్ చేయాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు.

సస్పెన్షన్‌కు గురైన పోలీస్ కానిస్టేబుల్ పరమేశ్


చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో పరమేశ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, యునానీ ఆస్పత్రి ఘటనపై సీపీ విచారణకు ఆదేశించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని డీసీపీకి స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 1, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading