వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరిక.. అలాంటి పోస్టులు పెడితే జైలుకే..

Hyderabad | WhatsApp Fake News | హైదరబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం నాడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పెడితే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 20, 2019, 11:09 AM IST
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరిక.. అలాంటి పోస్టులు పెడితే జైలుకే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏదైనా వాట్సాప్ గ్రూప్‌కు మీరు అడ్మిన్‌గా ఉన్నారా? అయితే జరభద్రం. గ్రూప్‌లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే.. పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు హైదరబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం నాడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పెడితే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర దేశాల్లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోలను కొందరు వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారని, దీనివల్ల నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశముందని ఆయన అన్నారు.

ఎన్నో అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ఆయన.. వాట్సాప్ వీడియోలు, సందేశాలపై పోలీసు శాఖ నిఘా వేసిందని స్పష్టం చేశారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: August 20, 2019, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading