Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిడ్నాప్ కలకలం

Hyderabad: ఎయిర్ పోర్టులో దిగిన ఫ్యామిలీ... ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్ చేసుకున్నారు. ఒక క్యాబ్‌లో పేరెంట్స్.. మరో క్యాబ్‌లో పిల్లలు ఎక్కారు.

news18-telugu
Updated: August 2, 2019, 2:41 PM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిడ్నాప్ కలకలం
శంషాబాద్ విమానాశ్రయం
  • Share this:
ఈమధ్య హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసులు వరుసగా నమోదవుతున్నాయి. ఆ మధ్య ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు... కోటి రూపాయలు తీసుకొని విడిచిపెట్టారు. హిమాయత్ నగర్‌లో కూడా ఓ యువతిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ఆ తర్వాత ఆమెను విడిచి పెట్టారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా ఓ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ముంబై నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. ఎయిర్ పోర్టులో దిగిన ఫ్యామిలీ... ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్ చేసుకున్నారు. ఒక క్యాబ్‌లో పేరెంట్స్.. మరో క్యాబ్‌లో పిల్లలు ఎక్కారు. అయితే పిల్లలు వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ వారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో వెంటనే తేరుకున్న తల్లిదండ్రులు మరోకారులో అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసులు కూడా వరుసగా కిడ్నాప్ కేసులు నమోదవ్వడంపై సతమతమవుతున్నారు. కిడ్నాప్ ఘటనలకు చెక్ పెట్టేందుకు ఖాకీ బాస్‌లు కసరత్తు చేస్తున్నారు. జనాల్లో కూడా ఇలాంటి విషయాల పట్ల అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.



First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading