ఆదాయం వస్తుందని ఆశపడితే.. అడ్డంగా బోల్తా కొట్టించారు..

సోమవారం వికాస్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు.ఇంటర్నెట్‌లో ఫేక్ ప్రకటనలు ఇచ్చే వెబ్‌సైట్స్ చాలానే ఉన్నాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: February 12, 2019, 8:35 AM IST
ఆదాయం వస్తుందని ఆశపడితే.. అడ్డంగా బోల్తా కొట్టించారు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 8:35 AM IST
హైదరాబాద్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఓ ఫేక్ వెబ్‌సైట్ నిర్వాహకుల చేతిలో మోసపోయాడు. ఇంటిపై సెల్‌ టవర్‌కి అనుమతిస్తే.. నెల నెలా ఆదాయం వస్తుందన్న మాయ మాటలు నమ్మి మోసపోయాడు. దాదాపు రూ.8లక్షల వరకు వారికి సమర్పించుకున్నాడు. తీరా మోసపోయానని తెలిశాక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ భోలక్‌పూర్‌కి చెందిన వికాస్(పేరు మార్చాం)కి స్థానికంగా సొంత ఇల్లు ఉంది. ఇంటి టెర్రస్‌పై 500 గజాల స్పేస్ ఉంది. ఆ స్థలాన్ని ఏదైనా సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌కి అద్దెకు ఇవ్వాలని భావించాడు. తద్వారా నెల నెలా ఆదాయం సమకూరుతుందని ఆశపడ్డాడు.

అనుకున్నట్టుగానే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి www.towersjio.in సైట్‌లో దానికి సంబంధించిన ఒక ప్రకటన చూశాడు. ఇంటిపై సెల్ టవర్‌కు అనుమతిస్తే.. నెలకు రూ.25వేలు చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. దీంతో వారిని వికాస్ వారిని సంప్రదించగా.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.8లక్షలు కట్టాలని చెప్పారు. చెప్పినట్టుగానే ఆ డబ్బంతా చెల్లించాడు. అయితే ఆపై మరింత డబ్బు కావాలని వారు ఒత్తిడి చేయడంతో మోసపోయానని వికాస్ గ్రహించాడు.

సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. పోలీసులు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఫేక్ ప్రకటనలు ఇచ్చే వెబ్‌సైట్స్ చాలానే ఉన్నాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...