news18-telugu
Updated: July 29, 2019, 10:23 AM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్‌ని దుండగులు.. కిడ్నాప్ చేశారు. హైదరాబాదులో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న గజేంద్ర ప్రసాద్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. దోమల్ గూడ నుంచి అతడ్ని దుండగులు తీసుకెళ్లి... మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు నుంచి కోటి రూపాయలు తీసుకొని ...అబీడ్స్ వద్ద డబ్బులు కలక్ట్ చేసుకున్న కిడ్నాపర్లు వ్యాపారవేత్తను వదిలిపెట్టేశారు.
గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. వ్యాపార లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని వ్యాపారవేత్తలతో గజేంద్ర ప్రసాద్‌కు గొడవలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
July 29, 2019, 10:23 AM IST