అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే యువతి హాత్మహత్య చేసుకుంది. బ్యూటీషియన్‌గా పనిచేసే ఆ యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు..లక్ష్మీ గూడకు చెందిన లీజ(19) అనే యువతి బ్యూటీషియన్‌గా వర్క్ చేస్తుంది. ఆమెను అష్రాష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండటంతో.. ఆ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు అష్రాఫ్‌ను మందలించారు. అయినా కూడా అష్రాఫ్ వేధింపులు ఆగలేదు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. యువతి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా లీజ్ ఫోన్లో 35 మిస్డ్ కాల్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అంటే అష్రాఫ్ ఎంత దారుణంగా వేధింపులకు గురిచేసాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అతడికి కొంతమంది బడా నాయకులు అండదండలు ఉన్నందువల్లే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అష్రాఫ్‌ను అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.