హైదరాబాద్‌లో దారుణం: కస్టమర్లతో వ్యభిచారం చేయలేదని.. బార్ డ్యాన్సర్‌ను..

Sexual harassment: కస్టమర్లతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆమె నిరాకరించింది. డబ్బులు ఇస్తారు.. సుఖంగా ఉండొచ్చంటూ ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు.

news18-telugu
Updated: June 17, 2019, 2:08 PM IST
హైదరాబాద్‌లో దారుణం: కస్టమర్లతో వ్యభిచారం చేయలేదని.. బార్ డ్యాన్సర్‌ను..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కస్టమర్లతో వ్యభిచారం చేసేందుకు నిరాకరించిందని ఓ బార్ డ్యాన్సర్‌పై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితం ఓ యువతి(25) ప్రముఖ లిస్బన్ బార్‌లో డ్యాన్సర్‌గా చేరింది. మొదట్లో ఆమెతో డ్యాన్స్ మాత్రమే చేయించిన బార్ నిర్వాహకులు.. కస్టమర్లతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆమె నిరాకరించింది. డబ్బులు ఇస్తారు.. సుఖంగా ఉండొచ్చంటూ ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. అయినా, లొంగకపోవడంతో ఆమెను లైంగికంగా వేధించారు. అయితే, ఆదివారం నాడు నలుగురు మహిళలు, సయ్యద్ అనే కస్టమర్ ఆమెను బార్ వీధిలో దారుణంగా చితకబాదారు. ఒంటిపై దుస్తులు చింపేసి, ఆమెను వివస్త్రను చేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

అయితే, బాధితురాలు అంతకుముందు సినీ పరిశ్రమలో పని చేసేదని, ఆర్థిక ఇబ్బందులతో డ్యాన్సర్‌గా బార్‌లో చేరిందని పోలీసులు తెలిపారు. తాను ఇంతకుముందే పోలీసులను ఆశ్రయించానని, కానీ, తన ఫిర్యాదును ఖాతరు చేయలేదని బాధితురాలు ఆరోపించింది.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>