బంజారాహిల్స్‌లో స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... మహిళ మృతి

మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు.

news18-telugu
Updated: November 26, 2019, 2:52 PM IST
బంజారాహిల్స్‌లో స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... మహిళ మృతి
బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం
  • Share this:
హైదరాబాద్ బంజారాహీల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక డ్రైవర్‌ను చితక బాదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలు టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సోహిని సక్సేనాగా గుర్తించారు.


ఈ ప్రమాదంతో రోడ్ నెంబర్ 12 లో  ట్రాఫిక్ జామ్ అయ్యింది. మసబ్ టాంక్ నుంచి బంజారా హిల్స్ వెళ్లే వాహనాల్ని నిలిచిపోయాయి.  రోడ్డు ప్రమాదం సమాచారం స్థానికులు పోలీసులకు అందించారు.  దీంతో ఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు మహిళ డెడ్ బాడీని పోస్టు మార్టమ్‌కు తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>