HYDERABAD BABA WHO CHEATED LAKHS BY SAYING THAT IF THE SPRAY HITS THE MONEY IN THE LOCKERS WILL BE DOUBLED KNR PRV
Money double spray: ఈ ఒక్క స్ప్రే కొడితే మీ బీరువా, లాకర్లలో ఉన్న డబ్బులు రెట్టింపు అవుతాయట.. ఇంతకీ ఏమిటీ స్ప్రే.. ఏంటా కథ..?
దొంగ బాబా ఇచ్చిన సీసా
సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ లో దూసుకుపోతున్న కాలం. అయినా కూడా సంఘటనలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. తాజాగా ఓ స్ప్రే కొడితే బీరువాలో లాకర్లో ఉన్న డబ్బులు డబుల్ అవుతాయనే ప్రచారం ఊపందుకుంది.. ఇంతకీ ఏమిటీ స్ప్రే.. ?
సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ లో దూసుకుపోతున్న ఈ కాలంలో దొంగ బాబాలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నారు. అమాయక ప్రజల టార్గెట్గా.. మోసం చేసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చుని .. దొంగ బాబాలు అవతారమెత్తి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి ఒక సంఘటనే ఆలస్యంగా కరీంనగర్లో (Karimnagar) వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ చెందిన దొంగ బాబా అమావాస్య రోజున పూజలు చేస్తే సంచుల్లో, బీరువాళ్ళో, లాకర్లో ఉన్న డబ్బులు రెట్టింపు (Money double) అవుతాయి . మీ వద్ద ఎంత ఉంటే అంత తీసుకుని రండి అని ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు చెందిన కొంతమంది నిలువునా మోస పోయారు.. రెట్టింపు విషయం పక్కన పెడితే .. ఉన్న డబ్బుల మూటలు మాయం కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో ఓ వ్యక్తి అత్యాశకు పోయి .. అప్పు తెచ్చి మరీ డబ్బులు బాబా చేతికి ఇచ్చాడు. తీరా మోసం అని తెలియడంతో బోరుమన్నాడు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ చందు గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన భాషవేని వీరయ్యతో పరిచయం ఉంది . ఇటీవల ప్రేమచంద్ కరీంనగర్ జిల్లా గంగాధరకు వెళ్లాడు . వీరయ్య , అతని బాబా విద్యలతో మిత్రులు మహేందర్ , రాజయ్యను కలిశాడు. తనకు హైదరాబాద్లో ఇటీవల ఓ బాబా పరిచయమయ్యాడని.. అతనికి తాంత్రిక శక్తులు ఉన్నాయని చెప్పాడు. అతని మాయమంత్రాలతో డబ్బుల మూటలను పదింతలు చేసిస్తాడని నమ్మబలికాడు . తొలుత వీరెవరూ ప్రేమచందర్ మాటలు నమ్మ లేదు . దీంతో వారిని డెమో కోసం హైదరాబాద్ (Hyderabad), సంగారెడ్డి తీసుకెళ్లాడు.
భూమి కాగితాలపై సంతకం..
అక్కడ పాత మసీదు వద్ద తనకున్న కనికట్టు విద్య చూపించాడు. వారి ఎదుట డబ్బులు కుప్పలుగా వచ్చేలా చేశాడు. ఇదంతా తన వద్ద ఉన్న స్ప్రేతో (Spray) చేశానని , మీకు కావాలంటే రూ .15 లక్షలు చెల్లించి కొనుక్కోవాలని (Buy) సూచించాడు. కళ్లముందు కుప్పలుగా డబ్బులు చూసేసరికి ఆ ముగ్గురు అత్యాశకు పోయారు. డబ్బు కోసం ఇళ్లకు పరుగులు తీశారు. మొత్తానికి రూ .15 లక్షలు సేకరించారు . ఇందులో విషాదకరం ఏంటంటే .. బాధితుల్లో వీరయ్య వద్ద డబ్బులేదు. నగదు కోసం మహేందర్ వద్ద కొన్ని భూమి కాగితాలపై సంతకం పెట్టాడు. డబ్బులు తీసుకోని అంతా కలిసి ఓ రోజు ప్రేంచంద్ తో కలిసి హైదరాబాద్ వెళ్లారు. నాంపల్లి స్టేషన్ వద్ద ఆ బాబాను కలిశారు .
భోజనం చేశాక రూ .15 లక్ష లు తీసుకున్న బాబా .. ప్రార్థనలు చేయాలని చెప్పి నగదుతో ఉడాయించాడు . దీంతో బాధితులు ప్రేమ్చంద్నును నిలదీశారు . డబ్బు ఎక్క డికీ పోదని ధైర్యం చెప్పిన ప్రేమ్ చంద్ పోయిన డబ్బులో రూ.7.50 లక్షలు చెల్లిస్తానని నోటు రాసిచ్చాడు . రోజులు గడుస్తున్నా ప్రేమ్చంద్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఒప్పందం ప్రకారం .. తనకు భూమి అమ్ముతానని చెప్పి ఇంతవరకూ రిజిస్ట్రేషన్ చేయడం లేదని మహేందర్ లాయరు ద్వారా వీరయ్యకు లీగల్ నోటీ సులు పంపాడు. దీంతో వీరయ్య తాను కేవలం సంతకాలే పెట్టానని , ఏనాడూ భూమిని విక్రయిస్తానన లేదని వాపోతున్నాడు .
మరోవైపు తమ మధ్య ఒప్పందం జరిగిందని మహేందర్ వాదిస్తున్నాడని సమాచారం . అటు బాబా , ఇటు స్నేహితుడి చేతిలో మోసపోయానని వీరయ్య నెత్తీనోరు బాదుకుంటున్నాడు . తనకు న్యాయం చేయాలని ఇప్పటికే కరీంనగర్ సీపీ కార్యాలయం ఆశ్రయించానని , మోసం జరిగింది రాజధానిలో కాబట్టి , అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారన్నాడు . ఈ ముగ్గురే కాకుండా .. కరీంనగర్. రాజన్న సిరిసిల్ల జిల్లా. పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు వ్యాపారస్తులు కూడా అదే దొంగబాబాని నమ్మి దాదాపుగా దాదాపు రూ . 50 లక్షలు మోసపోయారని తెలిసింది . ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల , వేములవాడ , జగిత్యాల , పెద్దపల్లి ప్రాంతాల్లో సదరు బాబా ఏజెంట్లను నియమించుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.