హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad Airport: కిలాడీ లేడీ.. లో దుస్తుల్లో బంగారం పేస్ట్.. ఎలా పట్టుబడిందంటే..

Hyderabad Airport: కిలాడీ లేడీ.. లో దుస్తుల్లో బంగారం పేస్ట్.. ఎలా పట్టుబడిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ మహిళను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

బంగారం తరలించడంలో స్మగ్లర్లు రోజురోజుకు కొత్త కొత్త విధానాలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరికి అనుమానం రాకుడా ఉండేందుకు లోదుస్తులు, పురుషాంగాల్లో సైతం బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్న ఓ కిలాడీ లేడీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అధికారులకు పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన మహిళ వద్ద నుంచి 548 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఎయిర్‌ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు ఆ మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని క్షుణంగా తనిఖీ చేశారు. ఆమె లో దుస్తుల్లో బంగారం పేస్టు రూపంలో దాచి ఉంచినట్టు గుర్తించారు. లో దుస్తుల్లో దాచిన బంగారాన్ని అధికారుల బృందం ఆమెతోనే తీయించారు. పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఆమె వద్ద నుంచి 48 గ్రాముల బరువు గల బంగారం స్వాధీనం చేసుకున్నామని దాని విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఇక, ఆ బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి ఆమె సరఫరా చేస్తుందనే దానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది.

మరో ఘటనలో హైదరాబాద్ నుంచి విదేశాలకు కరెన్సీ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 8.4 లక్షల విలువ చేసే ఫారెన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇక, మూడు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో కోటి 15 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా మిక్సర్ గ్రైండర్‌‌లోని కటింగ్ మిషన్‌లో‌ బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 2.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Gold smuggling, Hyderabad, Shamshabad Airport

ఉత్తమ కథలు