వీడిన హత్య మిస్టరీ.. ఆరోజు రాత్రి ఆ బాలుడిపై లైంగిక దాడి

బాలుడు గట్టిగా ప్రతిఘటించడంతో బండరాయితో తల, పొట్ట భాగాలపై బలంగలా మోది హత్య చేశాడు. బాలుడి కేకలకు స్థానికులు అప్రమత్తమవడంతో ఒమర్ అక్కడినుంచి పరారయ్యాడు.

news18-telugu
Updated: May 13, 2019, 8:54 PM IST
వీడిన హత్య మిస్టరీ.. ఆరోజు రాత్రి ఆ బాలుడిపై లైంగిక దాడి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 13, 2019, 8:54 PM IST
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఏడేళ్ల బాలుడి హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. బాలుడిపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని ఒమర్‌బిన్ హసన్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన బాలుడి కుటుంబం బాలాపూర్‌లో చాలాకాలంగా నివాసం ఉంటోంది. ఈ నెల 8వ తేదీ రాత్రి 9గంటలకు ఏదో వస్తువు తీసుకురమ్మని అతని కుటుంబ సభ్యులు బాలుడిని సమీపంలోని దుకాణానికి పంపించారు.

బాలుడు దుకాణానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఒమర్ అతన్ని అడ్డగించాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో బాలుడు గట్టిగా ప్రతిఘటించడంతో బండరాయితో తల, పొట్ట భాగాలపై బలంగలా మోది హత్య చేశాడు. బాలుడి కేకలకు స్థానికులు అప్రమత్తమవడంతో ఒమర్ అక్కడినుంచి పరారయ్యాడు. బాలుడి మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరగానే మిస్టరీని చేధించారు.

First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...