నన్ను 139 మంది రేప్ చేశారు... 25 ఏళ్ల యువతి కంప్లైంట్... 42 పేజీల FIR

బాధితురాలు

ఇది ఏ విదేశాల్లోనో అనుకోకండి. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఈ కేసు నమోదైంది. నమ్మలేకపోతున్నట్లు ఉన్న ఈ కేసు వివరాల్ని తెలుసుకుందాం.

 • Share this:
  ఒక్కసారి రేప్ జరిగితేనే అదో పెద్ద నేరం. అలాంటిది... ఆ పాతికేళ్ల యువతి తనను ఏకంగా 139 మంది రేప్ చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం... హైదరాబాద్‌లో సంచలనం అవుతోంది. కొన్నేళ్లుగా తనపై ఈ అత్యాచారాల పరంపర కొనసాగుతోందని ఆమె 42 పేజీల FIRలో పోలీసులకు తెలిపింది. నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు...మిర్యాల గూడకు చెందిన వ్యక్తితో 2009లో ఆమె పెళ్లైంది. అంటే అప్పుడు ఆమె వయస్సు 14 ఏళ్లు అనుకోవచ్చు. పెళ్లైన ఏడాదికే విడాకులతో వివాహ బంధం ముగిసింది. ఆ తర్వాత... పుట్టింట్లో ఉండగా... విద్యార్థి సంఘాల నాయకులతో పరిచయం ఏర్పడింది. దాంతో రాజ్‌భవన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. అక్కడే తనపై కొన్నేళ్లుగా అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిపింది.

  బాధితురాలు


  అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాక... చాలాసార్లు గ్యాంగ్ రేప్ చేశారనీ, గర్భం దాల్చితే అబార్షన్ చేయించారని, తనను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశారనీ, సిగరెట్లతో వాతలు పెడుతూ... హింసించారని బాధితురాలు తెలిపింది. ఎవరికైనా చెబితే... చంపుతామని గన్‌తో బెదిరించారని వివరించింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయ నేతల పీఏలు, విద్యార్థి సంఘాల నాయకులు, టాలీవుడ్ నటులు కూడా ఉన్నారని బాధితురాలు ఆరోపించింది. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చింది.

  తెలంగాణలోనే కాదు... తమిళనాడు, కర్ణాటక, ఏపీలో కూడా తనపై అత్యాచారాలు జరిగినట్లు ఆమె తెలిపింది. తనతో నగ్నంగా డాన్సులు చేయిస్తూ... వీడియోలు తీస్తూ... ఎవరికైనా చెబితే... వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని ఆ యువతి కంప్లైంట్‌లో తెలిపింది. ఆమె చెప్పిందంతా విన్న పోలీసులు... IPCలోని వేర్వేరు సెక్షన్ల కింద కంప్లైంట్ నమోదు చేశారు. ఆమెను వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా... పంజాగుట్ట పీఎస్‌కి ఓ పోలీస్ అధికారిని అటాచ్ చేశారు. మరి ఇన్నేళ్లుగా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదన్న అనుమానం మనకు రావడం సహజం. భయం వల్లే ఇవ్వలేదని పోలీసులు బాధితురాలు చెప్పినట్లు తెలిసింది.
  Published by:Krishna Kumar N
  First published: