హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. విమానంలో సీటు కింద 2.3 కిలోల బంగారం.. అసలు ఏం జరిగిందంటే..

Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. విమానంలో సీటు కింద 2.3 కిలోల బంగారం.. అసలు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 2.3 కిలోల బంగారాన్ని మిమానంలోని సీటు కింద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇంటెలిజనెన్స్ యూనిట్ అధికారులు, కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత సోమవారం తెల్లవారుజామున కువైట్ నుంచి వచ్చిన షేక్ మస్తాన్ నుంచి 160 గ్రాములు బంగారు కడ్డీలను గుర్తించారు. అతడు Jazeera Airlines Flight (J9-1403)‌లో హైదరాబాద్ వచ్చాడని అధికారులు తెలిపారు. అతడు తన దుస్తుల్లో బంగారాన్ని దాడి ఉంచాడని చెప్పారు. అతడి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు.

మరో ఘటనలో డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదికారులు.. అక్రమంగా తరలిస్తున్న 2.3 కిలోల బంగారాన్ని మిమానంలోని సీటు కింద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి 2.3 కిలోల బంగారం బిస్కెట్లను లైఫ్‌ జాకెట్‌లో పెట్టుకొని దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ చేరుకున్నాడు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీన్ని గమనించిన ప్రయాణికుడు బంగారం బిస్కెట్లున్న జాకెట్‌ను విమానంలో సీటు కింద పెట్టి దిగిపోయాడు. అయితే ఇందుకు సంబంధి ఆ సీటులో ప్రయాణించిన వ్యక్తిని అనుమానితుడిగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. "స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోటి రూపాలయకు పైగానే ఉంటుంది. అయితే ఇది మేము ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకోలేదు. బంగారాన్ని విమానంలో దాచిపెట్టిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగే దానిని ఎవరైతే తీసుకోవడానికి వచ్చేవారే ఎవరనేదానిపై కూడా ఆరా తీస్తున్నాం" డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు.

First published:

Tags: Gold smuggling, Hyderabad, Shamshabad Airport

ఉత్తమ కథలు