• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HYDERABAD 11 YEAR OLD BOY CAUGHT FOR ROBBERY AT TEMPLE IN SHAMSHABAD SU

Hyderabad: ఆలయంలో చోరి చేసిన 11 ఏళ్ల బాలుడు.. తిరిగి బయటకు వెళ్తుండగా ఊహించని పరిణామం..

Hyderabad: ఆలయంలో చోరి చేసిన 11 ఏళ్ల బాలుడు.. తిరిగి బయటకు వెళ్తుండగా ఊహించని పరిణామం..

ప్రతీకాత్మక చిత్రం

ఆలయంలో నగదు చోరీ చేసిన ఓ బాలుడు తిరిగి బయటకు వస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. దీంతో అతడికి ఏం చేయాలో తోచలేదు.

  • Share this:
    11 ఏళ్ల వయసులోనే ఓ బాలుడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సెల్‌ఫోన్ దొంగతనాలు చేస్తూ అడ్డదారిలో డబ్బులు సంపాదించేవాడు. అయితే ఇటీవల ఓ ఆలయంలో చోరీకి వచ్చిన అక్కడ టేబుల్ ఖానాలో దాచిన డబ్బును దొంగిలించి. అయితే ఆలయం నుంచి బయటకు వస్తూ చెట్టు తొర్రలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్‌ మండలం ఇందిరానగర్‌ దొడ్డి ప్రాంతానికి చెందిన బాలుడు(11) సోమవారం మధ్యాహ్నం ఘాంసిమియాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఆలయంలోకి భక్తుడిలా వచ్చాడు. దొంగతనం చేయాలనే ప్లాన్‌తో గుడిలోకి అడుగుపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు చేతిలో కొబ్బరికాయ తీసుకెళ్లాడు.

    ఆలయంలో కొంతసేపు గడిపిన అతడు.. పూజలు చేస్తున్నట్టు నటించాడు. అయితే అదను చూసుకుని ఆలయం లోపల టేబుల్ ఖానాలో నుంచి 10 వేల రూపాలయను దొంగిలించాడు. అనంతరం తిరిగి బయటకు వచ్చే సమయంలో చెట్టు తొర్రలో ఇరుక్కుపోయాడు. ఇక, ఆ తర్వాత కొద్దిసేపటికి ఆలయానికి వచ్చిన పూజారికి టేబుల్ ఖానాలోని డబ్బులు కనిపించలేదు. దీంతో కంగారు పడిపోయిన పూజారి స్థానికులకు విషయం చెప్పాడు. అనంతరం వారితో కలిసి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాలుడు ఆలయంలోకి వచ్చి చెట్టు తొర్రలోకి వెళ్లినట్టుగా గుర్తించారు.

    Vijayawada: సాప్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచార యత్నం.. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో..

    Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

    చనిపోయిన కొడుకు ఫొటోతో సినిమా థియేటర్‌కు వచ్చిన తండ్రి.. అక్కడున్న వారు ఏమిటని ఆరా తీయగా..

    దీంతో వారు చెట్టు తొర్ర వద్దకు వెల్లి చూడగా బాలుడు అందులోనే ఉన్నాడు. అనంతరం బాలుడిని అక్కడే ఉంచి.. పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి వద్ద నుంచి రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా ఆ బాలుడు దొంగతనాలు చేశాడని.. సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు