Home /News /crime /

HUSBEND COMMITS SUICIDE DUE TO ALLEGED HARASSMENT BY WIFE IN HYDERABAD MKS

Hyderabad: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

మృతుడు శ్రవణ్ కుమార్

మృతుడు శ్రవణ్ కుమార్

భర్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమేరకు సూసైడ్ నోట్ రాశాడు. హైదరాబాద్ శివారు మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. మీర్ పేట్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

పురుషాధిక్య సమాజంలో భర్తల వేధింపులు తట్టుకోలేక బలన్మరణానికి పాల్పడుతోన్న భార్యల సంఖ్య ఎక్కువే. అయితే, ఈ ఘటనలో మాత్రం భర్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమేరకు సూసైడ్ నోట్ రాశాడు. అయితే విచారణలో భిన్న కోణాలు వెలుగులోకి వచ్చాయి. భార్యతో గొడవలు, అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శివారు మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. మీర్ పేట్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

సైదాబాద్‌కు చెందిన శ్రీరాముల శ్రావణ్‌కుమార్‌(32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్‌పేట్‌లోని లక్ష్మీదుర్గ కాలనీలో స్థిరపడ్డాడు. 2019లో జనగామకు చెందిన రవళి(26)తో అతడికి వివాహమైంది. వారికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో రవళి భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రావణ్‌కుమార్‌ మానసికంగా కుంగిపోయాడు.

Nakkapalle: అన్నయ్యా.. ప్లీజ్ వదులన్నా.. నోట్లో గుడ్డలు కుక్కి.. తల్లి, సోదరి నగ్న వీడియోలు కావాలంటూ.. విశాఖలో దారుణం



భార్య వెళ్లిపోయిన తర్వాత శ్రావణ్ మద్యానికి బానిసయ్యాడు. అప్పులు పెరగడంతో లక్ష్మీదుర్గ కాలనీలోని ఇల్లు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న రవళి అందులో తనకూ వాటా ఉందని, వాటా తేలే వరకూ ఇల్లు అమ్మొద్దని పేర్కొంటూ లీగల్‌ నోటీసు పంపించింది. దాంతో మనస్తాపం చెందిన శ్రావణ్‌కుమార్‌ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: హుస్సేన్‌సాగర్‌పై వేలాడే వంతెన.. మాస్కో మోడల్ నిర్మాణం: KCR సర్కార్



శ్రవణ్ కుమార్ మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి, పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటి వారే కారణమని మృతుడు సూసైడ్‌ నోట్‌ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Husband commit suicide, Hyderbad, Suicide

తదుపరి వార్తలు