పిల్లలు పుట్టలేదని...భార్యను చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు...

చిమ్మ చీకటి మధ్య కొన్ని రోజులుగా నరకం చూసిందా మహిళ. తినడానికి తిండి కూడా లేకపోవడంతో ఆకటితో అలమటించింది. కడపలో దారుణం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: February 11, 2019, 10:10 PM IST
పిల్లలు పుట్టలేదని...భార్యను చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 11, 2019, 10:10 PM IST
భార్యకు పిల్లలు కలగడం లేదనే కోపంతో ఆమెను దూరంపెట్టాడు భర్త. నిత్యం చిత్రహింసలు పెడతూ నరకం చూపించాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించి తాళం వేశాడు. చిమ్మ చీకటి మధ్య కొన్ని రోజులుగా నరకం చూసిందా మహిళ. తినడానికి తిండి కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించింది. కడపలో దారుణం చోటుచేసుకుంది.

కడపకు చెందిన గౌసియాకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇప్పటి వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. దాంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. పిల్లలు పుట్టలేదన్న కారణంతో ఆమెను టార్చర్ చేశాడు. ఎలాగైనా వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ ఎంత తిట్టినా..కొట్టినా..భర్త కాళ్ల దగ్గరే పడి ఉండేది గౌసియా. దాంతో తనను వదిలేలా లేదని భావించిన భర్త.. ఆమెను బూత్ బంగ్లాలాంటి ఓ ఇంట్లో నిర్బంధించాడు. కొన్ని రోజులుగా ఆ చీకటి గదిలోనే ఉంది గౌసియా. విషయం తెలుసుకున్న గౌసియా బంధువులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు.First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...