• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HUSBAND WHO KILLED HIS WIFE ACCEPTED CRIME AFTER ONE MONTH AK PRN

Husband Killed wife: చనిపోయిన భార్య.. నెల రోజుల తరువాత ట్విస్ట్.. ఏం జరిగిందంటే..

Husband Killed wife: చనిపోయిన భార్య.. నెల రోజుల తరువాత ట్విస్ట్.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Husband Kills Wife: ఇటీవల వచ్చిన రిపోర్ట్‌తో పోలీసులే కాదు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులు తేల్చారు.

  • Share this:
    ఆ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ. పెళ్లయిన నాటి నుంచి వారి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరగలేదు. ఇలా నాలుగేళ్లు గడిచాయి. సడన్ గా ఓ రోజు రాత్రి భార్య మృతి చెందింది. అనారోగ్యంతో చనిపోయిందని అందరూ భావించారు. కానీ నెలరోజుల తర్వాత ఊహించని ట్విస్ట్ అందర్నీ షాక్‌కి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా చాట్రాయికి చెందిన యువకుడికి నాలుగేళ్ల క్రితం నూజివీడుకు చెందిన యువతితో పెళ్లి జరిగింది. అతడు హైదరాబాద్ లోని ఓ కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చారు. పెళ్లై నాలుగేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఎంతో మంది డాక్టర్లను సంప్రదించారు. చివరకు భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాడు. భార్యకు విడాకులిద్దామని భావించాడు. కానీ ఆమెను అడిగే ధైర్యం లేక విరమించుకున్నాడు.

    ఏం చేద్దామని ఆలోచిస్తుండగా అతడిలోని కిరాతకుడు నిద్రలేచాడు. నవంబర్ 1న మంచి టైమ్ చూసుకొని భార్య గొంతు నులిమి చంపేశాడు. తన భార్య అనారోగ్యంతో చనిపోయినట్లు నాటకమాడాడు. కూతురు-అల్లుడు ఎప్పుడు అన్యోన్యంగా ఉండటం చూసిన ఆమె తల్లిదండ్రులు...అతనిపై అనుమానపడలేదు. కూతురు అనారోగ్యంతోనే చనిపోయిందనుకున్నారు. ఘటన జరిగి నెలరోజులు కావడంతో రిలాక్స్‌గా బయట తిరుగుతున్నాడు. విషయం ఎలాగొలా పోలీసుల వరకు వెళ్లింది. భర్త మీద అనుమానంతో కేసు పెట్టాల్సిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు కానీ అందుకు వారు నిరాకరించారు. చివరకు వివిధ సెక్షన్లను ఉపయోగించి ఫిర్యాదు తీసుకున్నారు. అమ్మాయి బాడీకి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు.

    పట్టించిన పోస్ట్ మార్టం రిపోర్ట్
    ఇటీవల వచ్చిన రిపోర్ట్‌తో పోలీసులే కాదు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు షాక్ కు గురయ్యారు. ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులు తేల్చారు. తొలుత తనకేం తెలియదని బుకాయించిన భర్త ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. పిల్లలు పుట్టడం లేదని కారణంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తమ కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకున్న భర్తే... హత్య చేశాడన్న నిజాన్ని మృతురాలి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: