(K.Veeranna,News18,Medak)
వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న తన భార్యతో ఏ భర్త చేయించకూడని పని చేయించాడు. ఆమెను కష్టాల పాలుచేయడమే కాకుండా ఆమె మానాన్ని తన స్వార్ధం కోసం ఉపయోగించుకున్నాడు. చివరకు తన వ్యసనాల కోసం కట్టుకున్న భార్యను బలిచ్చాడో కిరాతకపు భర్త. సిద్దిపేట (Siddipet)జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈదారుణ సంఘటన. జిల్లాలోని మీరుదొడ్డి(Mirdoddy) మండలం కొండాపూర్(Kondapur)గ్రామానికి చెందిన దంపతులు బ్రతుకు దెరువు కోసం సిద్దిపేట పట్టణానికి వచ్చారు. రోజూ కూలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే భర్త మద్యానికి బానిసయ్యాడు. అందుకోసం డబ్బులు అవసరమై..కట్టుకున్న భార్యతో వ్యభిచారం చేయించాడు. ఆవిధంగా వచ్చిన డబ్బుతో మద్యం తాగడం పనిగా పెట్టుకున్నాడు. నాలుగు రోజుల క్రితం భార్య వ్యభిచారం(Adultery) చేసి తెచ్చిన డబ్బు తనకివ్వలేదని కోపంతో ఆమెను మరో వ్యక్తి సాయంతో హత్య చేశాడు.
భార్యతో వ్యభిచారం చేయించిన భర్త..
సిద్దిపేట పట్టణంలో నాలుగు రోజుల క్రితం ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మృతురాలు మీరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. సిద్దిపేట పట్టణంలో పని చేసుకునేందుకు భర్త తీసుకొచ్చాడు. ఈక్రమంలోనే భర్త మద్యానికి బానిస కావడంతో పని చేయకుండా డబ్బు కోసం భార్యను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఆమె తెచ్చిన డబ్బుతో రోజూ తాగేవాడు. ఈక్రమంలోనే నాలుగు రోజుల క్రితం భార్య వ్యభిచారం చేసి తెచ్చిన డబ్బు తనకు ఇవ్వలేదనే కోపంతో జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టాడు. అటుపై కిందపడేసి ఆమెను గొంతు పిసికి చంపి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు.
కాపురం కూల్చిన వ్యసనం..
పచ్చని కాపురంలో మద్యం వ్యసనం చిచ్చు పెట్టింది. శనివారం జరిగిన ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు నాలుగు రోజుల్లో పట్టుకున్నారు. భర్తతో పాటు హత్యకు సహాకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించారు నేరస్తులు. ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా సిద్దిపేట ఏసీబీవ దేవారెడ్డి తెలిపారు. కేసులో దోషుల్ని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు.
నేరపూరిత గుణం...
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అంటూ వివాహ సమయంలో అమ్మాయిని ఎలాంటి కష్ట, నష్టాల్లోనూ విడువనని , ఆమెను తనలో సగ భాగంగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్న భర్తలు తమ స్వార్ధంతో వ్యక్తిగత అవసరాలు, వ్యసనాలకు బలిగొంటున్నారు. వైవాహిక బంధానికి అర్ధం లేకుండా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Telangana crime news