Husband: ఇతని భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఆమెతో పడక విడాకులు అడిగాడు.. ఇంతలోనే ఇదేం పాడు పని..

ఓంకుమార్ (ఫైల్ ఫొటో)

అతని భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమెకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. దీంతో.. భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లి కాపురం పెట్టారు. కొన్ని నెలలకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలొచ్చాయి. ఆమె భర్త తిరిగి సొంతూరు వచ్చాడు. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది.

  • Share this:
    అతని భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమెకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. దీంతో.. భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లి కాపురం పెట్టారు. కొన్ని నెలలకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలొచ్చాయి. ఆమె భర్త తిరిగి సొంతూరు వచ్చాడు. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది.

    భార్య నుంచి విడాకులు కోరుతూ ఆమె భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు కోర్టులో ఉండగానే ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు భర్త ప్రయత్నించాడు. ఆమె ఫొటోతో సహా వివరాలన్నీ ఓ మ్యాట్రిమొనీ సైట్‌లో అప్‌లోడ్ చేసి ‘వరుడు కావలెను’ అని ప్రకటన ఇచ్చాడు. ఆమె తండ్రి నంబర్‌ను కాంటాక్ట్ కోసం ఇచ్చాడు. బాధితురాలి తండ్రికి పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో విసిగిపోయిన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో ఆ వివరాలను అప్‌లోడ్ చేసింది బాధితురాలి భర్త అని తేలింది. దీంతో.. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

    ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలోని వెలియూరు గ్రామానికి చెందిన ఓంకుమార్ డిగ్రీ పూర్తి చేశాడు. 2016లో తిరువళ్లూరులోని కాదంబత్తూరు పంచాయతీలోని ఉలుందై గ్రామానికి చెందిన బీటెక్ పూర్తి చేసిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువతి అప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఓంకుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ డెయిరీ వ్యాపారం చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందమైన జీవితం. వీరి జీవితం ఇలా సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఓంకుమార్ భార్యకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఆకర్షణీయమైన జీతం, జీవితం బాగుంటుందని భావించిన భార్యాభర్తలు ఇద్దరూ అమెరికాకు వెళ్లిపోయారు.

    అయితే.. అక్కడకు వెళ్లిన కొన్ని నెలలకు భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య పొసగకపోవడంతో ఓంకుమార్ భార్యతో విభేదించి వెలియూర్ వచ్చి మళ్లీ తన ఉద్యోగం, డెయిరీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్యను అక్కడే వదిలేసి రావడంతో అతనిపై కొందరు ఇబ్బందికర కామెంట్స్ చేశారు. తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం తన భార్యేనని భావించిన ఓంకుమార్ ఆమెకు విడాకులిచ్చి తెగతెంపులు చేసుకోవాలనుకున్నాడు.

    ఇది కూడా చదవండి: Shocking: నడిరోడ్డుపై నల్లబ్యాగ్ కలకలం.. బ్యాగ్‌లో నుంచి ఏడుపు శబ్దం.. బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా...

    పూనమల్లీలో ఉన్న సబ్ కోర్టులో భార్య నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు కోర్టులో ఉండగానే భార్యను ఇబ్బందిపెట్టే విధంగా ఓంకుమార్ ఓ తొందరపాటు చర్యకు పూనుకున్నాడు. ఆమె ఫొటోను, వివరాలను ప్రముఖ మ్యాట్రిమొనీ సైట్‌లో అప్‌లోడ్ చేసి.. ఈమెకు ‘వరుడు కావలెను’ అని యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్‌లో తన భార్య తండ్రి ఫోన్ నంబర్‌ను మెన్షన్ చేశాడు. ఆమె ప్రొఫైల్ నచ్చిన వారు ఆ నంబర్‌ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో.. ఆమె ప్రొఫైల్ చూసిన కొందరు యువకులు ఆమె తండ్రికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. తొలుత ఏదో పొరపాటున చేసి ఉంటారని బాధితురాలి తండ్రి భావించాడు. కానీ.. రోజురోజుకూ కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో విసిగిపోయిన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఈ పని చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పోలీసులు ఓంకుమార్‌ను అరెస్ట్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: