జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన భర్త.. ఇంటికి వెళ్లి భార్యను ఏం చేశాడంటే..

మృతురాలు జర్నా

ఎవరూ కావాలని నేరాలు చెయ్యాలనుకోరు. ఒక మనిషి... నేరస్థుడిగా మారేందుకు కొన్ని అంశాలు కారణం అవుతాయి. మరి అతని విషయంలో ఏం జరిగింది?

 • Share this:
  అది ఢిల్లీ. దేశ రాజధాని. కానీ క్రైమ్ విషయంలో ఎక్కడా తగ్గదు. జర్నా రోజూలాగే తన ఇంట్లో పనులు చేసుకుంటోంది. ఎవరో డోర్ కొట్టారు. ఎవరా అని తలుపు తీసింది. చూస్తే ఎదురుగా భర్త నంద నాయక్. జైలు నుంచి బెయిల్‌పై రిలీజయ్యాడు. అతన్ని చూసి ఆనందపడాలో, ఆందోళన చెందాలో అర్థం కాలేదు. వచ్చీ రావడమే... కోపంగా ముఖం పెట్టి... టీ పెట్టు అన్నాడు. పాలు లేవు అంది. అలా మళ్లీ వాళ్ల మధ్య గొడవ మొదలైంది. 2017లో ఆమెతోపాటూ... బావను కొట్టిన కేసులో నాయక్ అరెస్టయ్యాడు. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. రెండేళ్ల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు కెళ్లి వచ్చినా... అతనిలో మార్పు లేదు. అదే పొగరు. అదే చిరాకు.

  మనకు ఇష్టమైన వాళ్లతో జీవితాంతం కలిసి ఉండమన్నా ఉండగలం... అదే ఇష్టం లేని వాళ్లతో క్షణం కూడా ఉండలేం. జర్నా విషయంలో అదే జరిగింది. భర్త తీరు ఆమెకు ఏనాడూ నచ్చేది కాదు. తనను ఇష్టపడని ఆమె అంటే అతనికీ నచ్చేది కాదు. ఇద్దరి కాపురంలో రోజూ కలతలే. ఇద్దరికీ మనస్శాంతి లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. చుట్టుపక్కల వాళ్లు... సంసారం.. సాగరం... ఆటుపోట్లు కామనే అని సర్ది చెబుతూ ఉండేవాళ్లు.

  ఇది కూడా చదవండి: ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రేప్... HR మేనేజర్ ఉచ్చులో చిక్కిన యువతి

  తాజాగా అర్థరాత్రి వేళ ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఇద్దర్లో ఎవరూ వెనక్కి తగ్గలేదు. అతనికి పిచ్చి కోపం వచ్చింది. నా జీవితం నీవల్లే సర్వనాశనం అయిపోయింది... అసలు నిన్నూ... అంటూ దుప్పటి కప్పి... ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అతను అలా చేస్తాడని అస్సలు ఊహించని ఆమె... అతని కళ్లముందే... ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోతూ అరిచిన అరుపులు విని... చుట్టుపక్కల వాళ్లంతా... మూడో అంతస్తు కిటికీ దగ్గరకు వచ్చారు. మూసిన తలుపు తెరుద్దామంటే... లోపల గడియ వేసి ఉంది. పోలీసులకు కాల్ చేశారు.

  పావు గంటకు వచ్చిన పోలీసులు... మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోలీసుల ముందే పారిపోయిన నాయక్... దగ్గర్లోని గోవిందపురి పార్కులో దాక్కున్నాడు. కానీ పోలీసులు అతన్ని కనిపెట్టేసి మళ్లీ అరెస్టు చేశారు.

  ఇది కూడా చదవండి: సెక్స్ రాకెట్.. 80 వీడియోలు.. 250 మంది బాధితులు.. ఆర్గనైజ్డ్ క్రైమ్

  2017లో భార్య, బావను కొట్టిన నాయక్... జైలుకెళ్లాక... వాళ్లపై పగ పెంచుకున్నాడు. ముఖ్యంగా భార్యపై లోలోపల ఎంతో కసి, కోపం, ఆవేశం గూడుకట్టుకున్నాయి. ప్రతి రోజూ జైలు గోడల మధ్య స్వేచ్ఛను కోల్పోయినట్లు ఫీలైన అతను... భార్యపై కక్ష గట్టాడు. ఆమెను చంపితేనే తన పగ చల్లారుతుంది అనుకున్నాడు. జైల్లోని ఇతర ఖైదీలు కూడా అతనిలో మార్పు తేవడానికి ప్రయత్నించలేదు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నెల రోజులకే హత్య చేసాడు. ఆమెను ఎందుకు చంపావంటే... మనస్శాంతి కోసం చంపాను, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: