హోమ్ /వార్తలు /క్రైమ్ /

నా భర్తే తన ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు... ఓ భార్య వ్యథ...

నా భర్తే తన ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు... ఓ భార్య వ్యథ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News : హర్ష, అతని తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.

అహ్మదాబాద్‌... ఘట్లోడియాలో నివసిస్తున్నారు హర్ష, నేహ (పేర్లు మార్చాం). 2015లో వాళ్లిద్దరికీ పెళ్లైంది. తాజాగా వాళ్లిద్దరూ మనాలీ వెళ్లారు. అక్కడకు వాళ్లతోపాటూ హర్ష ఫ్రెండ్స్ కూడా వెళ్లారు. తీరా మనాలీ వెళ్లాక... హర్ష తన ఫ్రెండ్స్‌తో గడపాల్సిందిగా ఆమెను కోరాడు. ఆశ్చర్యపోయిన నేహా... కుదరదని తెగేసి చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాదనలు జరిగాయి. నేహాను బలవంతపెట్టిన హర్ష... ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. తన భర్తే తనకు శత్రువులా మారడంతో ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి ఆమెది. ఎంతకీ ఆమె ఒప్పుకోకపోయేసరికి రాక్షసుడిలా మారిన హర్ష... ఆమెకు చిత్ర హింసలు పెట్టాడు. అలా సరదా ట్రిప్ కాస్తా నరకంలా తయారైంది ఆమెకు.

మనాలీ వెళ్లినప్పుడు తనకు డ్రగ్స్ (మత్తు పదార్థాలు) ఇచ్చారనీ... హర్ష తనను బలవంతంగా ఓ హోటల్‌కి తీసుకెళ్లాడని పోలీసులకు నేహా తెలిపింది. ఆ హోటల్‌ గదిలోని హర్ష ఫ్రెండ్స్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారనీ... సెన్సార్ ఫొటోలు తీశారనీ ఆమె వివరించింది. వాళ్లతో పడుకోకపోతే, విడాకులు ఇస్తానని హర్ష బెదిరించినట్లు ఆమె పోలీసులకు చెప్పుకుంది. మనానీలో తనను బంధించి నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఘట్లోడియా పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష, అతని తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 94, 498 (k), 323, 294 (KH), 506 (1), 343, 348, 120 (b) కింద కేసు నమోదు చేశారు. అలాగే... వరకట్న వేధింపుల చట్టంలోని సెక్షన్ 3, 7 కింద కూడా కేసు నమోదైంది. అంతేకాదు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్లు 67, 67 (a) కింద కేసు నమోదు చేశారు. ఇన్ని కేసులు నమోదు చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. హర్ష ఓ చండాలుడు. ఆమెను తరచూ పోర్న్ సినిమాలు, వీడియోలూ చూడమనేవాడు. ఆమె వద్దంటే వినిపించుకునేవాడు కాదు. దురదృష్టమేంటంటే... ఆమె అత్తా, మామలు కూడా హర్షని సపోర్ట్ చేసేవాళ్లు.

నేహాతో బ్లాంక్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు భర్త, ఆమె అత్తమామలు. ఆ తర్వాత నేహా తల్లిదండ్రుల్ని ఇంటికి పిలిపించుకున్న హర్ష... వాళ్లు రాగానే... కూతుర్ని వాళ్లకే అప్పగించి... ఆమె కేరక్టర్ మంచిది కాదనీ... తీసుకుపొమ్మని అరిచాడు. ఆ పరిస్థితుల్లో వాళ్లు ఆమెను తమ ఇంటికి తీసుకుపోయారు. ఆ తర్వాత వాట్సాప్‌లో విడాకుల పత్రాలు పంపించాడు. అంతకు ముందు ఆమెతో సంతకాలు చేయించుకున్న హర్ష... విడాకుల తర్వాత ఆమెకు ఎలాంటి భరణమూ ఇవ్వాల్సిన పనిలేదన్నట్లుగా ఆ పత్రాలపై రాశాడు.

ఇలాంటి భర్తలుంటారు జాగ్రత్త అంటోంది ఈ యదార్థ గాథ. పేరెంట్స్ మీ కూతుర్లకు పెళ్లిళ్లు చేసేటప్పుడు అన్ని విషయాలూ పూర్తిగా తెలుసుకున్నాకే కమిట్ అవ్వమంటోంది ఈ వ్యధ.


ఇవి కూడా చదవండి :

పోలవరం నిజం.. ఎవరు పూర్తిచేస్తే వారికే ఓటేయండి: హీరో శివాజీ

మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...

ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు

చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారా... వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత

First published:

Tags: Crime, RAPE

ఉత్తమ కథలు