Home /News /crime /

HUSBAND USED TO BITE ON WIFE PRIVATE PART COURT ORDERS ARREST AND SEIZURE OF FAKE TEETH SSR

OMG: 67 ఏళ్ల ముసలాడిని పెళ్లి చేసుకుంది.. అయ్యగారు శృంగారం చేసిన తీరుకు దెబ్బకు భయపడిపోయి..

బాధితురాలు

బాధితురాలు

అతని వయసు 67 సంవత్సరాలు. కరోనా సోకి భార్య చనిపోయింది. ఆమె వయసు 40 సంవత్సరాలు. భర్తకు విడాకులిచ్చి దూరంగా ఉంటోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది.

  ఇండోర్: అతని వయసు 67 సంవత్సరాలు. కరోనా సోకి భార్య చనిపోయింది. ఆమె వయసు 40 సంవత్సరాలు. భర్తకు విడాకులిచ్చి దూరంగా ఉంటోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. తన కంటే 27 ఏళ్లు వయసులో పెద్ద వాడని తెలిసినప్పటికీ వ్యాపారవేత్త కావడంతో సుఖంగా జీవితం సాగుతుందని ఆశించి ఆమె 67 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకుంది. కానీ.. శృంగారం చేస్తున్న సమయంలో ఆ వృద్ధుడు ప్రవర్తించిన తీరుకు బెదిరిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన 67 ఏళ్ల వ్యాపారి గిరీష్ కుమార్ సోనీ. అతని భార్య గతేడాది కరోనాతో చనిపోయింది. ఆ తర్వాత తనకంటే 27 ఏళ్ల వయసు తక్కువ ఉన్న ఒక మహిళను ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి. ఇద్దరూ కలిసి హనీమూన్‌కు వెళ్లారు. తొలి రాత్రి శృంగారం చేస్తున్న సమయంలో ఆ వృద్ధుడు చేసిన పనికి అతని భార్య బెదిరిపోయింది. ఆమెతో మొరటుగా శృంగారంలో పాల్గొన్నాడు. అంతేకాదు.. రొమాన్స్‌లో భాగంగా ఒళ్లంతా కొరికి పెట్టాడు.

  ఇది కూడా చదవండి: Husband: భార్య అదే పనిగా ఫోన్ కాల్స్ మాట్లాడుతుండటంతో ఈ భర్త ఏం చేశాడో చూడండి..

  దీంతో.. ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే.. ఆ వృద్ధుడికి నోట్లో పళ్లు కూడా లేవు. పెట్టుడు పళ్ల సెట్ పెట్టుకుని మరీ ఆమెను కొరికి పైశాచిక ఆనందం పొందేవాడు. ఇంతటితో ఆగలేదు. చివరకు ఆమె ప్రైవేట్ పార్టును కూడా ఆ పెట్టుడు పళ్లతో కొరికి గాయపరిచాడు. రోజూ ఇదే తంతు.. వద్దని ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. నొప్పిగా ఉందన్నా కనికరం చూపించేవాడు కాదు. తనకు ఇలా చేస్తేనే శృంగారంలో సంతృప్తి దక్కుతుందని భార్యను ఒప్పించేవాడు.

  ఇది కూడా చదవండి: Newborn Kidnap: నర్సులా హాస్పిటల్‌కు వెళ్లి పసికందును కిడ్నాప్ చేసింది.. కారణం తెలిసి అవాక్కయిన పోలీసులు..

  శృంగారం సమయంలో భర్త పోకడలు మితిమీరడంతో చివరకు ఓపిక నశించి, అతని మృగ ప్రవర్తనకు విసిగిపోయి సదరు మహిళ తన సొంతూరైన ఇండోర్‌కు వెళ్లిపోయింది. తన భర్త అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నాడని, ప్రైవేట్ పార్టును కొరుకుతూ గాయపరుస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని దంతాలు కూడా ఒరిజినల్ కావని, దంతాల సెట్ పెట్టుకుని మరీ తనను కొరుకుతూ గాయపరిచేవాడని ఆమె ఆ చేదు అనుభవాన్ని తలుచుకుని కుమిలిపోయింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంత అందంగా ఉన్నావ్.. అమ్మానాన్న ఊరెళ్లి వచ్చే గ్యాప్‌లో.. ఇంట్లో అక్క ఉండగా..

  ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ పని కాలేదు. బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నప్పటికీ భార్యతో ఇతని క్రూరమైన చర్యల గురించి తెలుసుకున్న ఇండోర్ జిల్లా న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణ దశలో ఉండగానే సదరు బిజినెస్ మ్యాన్ తన భార్యను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. కోట్ల రూపాయలు తన వద్ద ఉన్నాయని, చివరకు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటానని.. ఫిర్యాదు ఉప సంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. మీ కుటుంబాన్ని కూడా చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఆ మహిళ చెబుతున్నట్టు నిజంగానే ఆమె శరీరంపై ఉన్న గాయాలు కొరికితే ఏర్పడినవేనో లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయగా.. కొరకడం వల్లే ఆ గాయాలు అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Husband, Indore, Sexual harrassment, Wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు