భార్య నగ్న వీడియోలతో యూట్యూబ్ ఛానెల్.. డబ్బు కోసం భర్త నీచం

కేవలం యూట్యూబ్‌లోనే ఆ వీడియోలను అప్‌లోడ్ చేశాడా? లేదంటే పోర్న్ సైట్లకు కూడా పంపాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఇంటర్నెట్‌తో పాటు తన మిత్రులకు కూడా భార్య నగ్న వీడియోలు, ఫొటోలను పంపినట్లు గుర్తించారు.

news18-telugu
Updated: November 22, 2020, 5:30 PM IST
భార్య నగ్న వీడియోలతో యూట్యూబ్ ఛానెల్.. డబ్బు కోసం భర్త నీచం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడికి కుటుంబ బాధ్యత లేదు. కష్టపడి పనిచేసి ఇంటిని పోషించుకుందామన్న ఆలోచన లేదు. పనీపాటా చేయకుండా ఈజీ మనీ కోసం అన్వేషణ మొదలపెట్టాడు. ఈ క్రమంలో ఓ పనికిమాలిన ఆలోచన ఆ బుర్రకు తట్టింది. డబ్బు కోసం ఏ భర్తా చేయకూడని దారుణమైన పని చేశాడు. భార్య నగ్న వీడియోలు, ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. గుంటూరు జిల్లాలో ఈ కీచక భర్త బాగోతం వెలుగు చూసింది. భర్త వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

గుంటూరు సిటీ దిశా పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం.. ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ పనీ చేయకుండా.. యూట్యూబ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆమె భర్త అనుకునేవాడు. అశ్లీల దృశ్యాలను పోస్ట్ చేస్తే ఎక్కువ మంది చూస్తారని.. తద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని అంచనా వేశాడు. అనుకున్నదే తడవుగా..ఛానెల్ క్రియేట్ చేసి, భార్య నగ్న వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆమెతో ఏకంకా గడిపిన దృశ్యాలను కూడా సీక్రెట్‌గా చిత్రకరించి నెట్టింట్లో పెట్టేశాడు. యూట్యూబ్‌లో తన వీడియో చూసి షాక్ తిన్న బాధితరాలు దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భార్య ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దిశ స్టేషన్ అధికారులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. రంగంలోకి దిగిన ఐటీ కోర్ టీమ్ యూట్యూబ్‌ నుంచి ఆమె వీడియోలను తొలగిస్తున్నారు. ఐతే కేవలం యూట్యూబ్‌లోనే ఆ వీడియోలను అప్‌లోడ్ చేశాడా? లేదంటే పోర్న్ సైట్లకు కూడా పంపాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఇంటర్నెట్‌తో పాటు తన మిత్రులకు కూడా భార్య నగ్న వీడియోలు, ఫొటోలను పంపినట్లు గుర్తించారు. బాధితురాలు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసును గుంటూరు అర్బన్‌ పోలీసు ఉన్నతాధికారి స్వయంగా పరిశీలిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2020, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading