Home /News /crime /

HUSBAND TYING WIFE TO CHAINS AT HOME IN KOTTAGUDEM DISTRICT BN

భార్యను గొలుసులతో కట్టేసిన భర్త.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్య తరచూ ఇంటి నుంచి బయటకు వెళుతుందని గొలుసులతో కట్టేశానని చెబుతుండగా భార్య మాత్రం తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెడుతున్నాడంటూ చెబుతోంది.

    ఓ భర్త తన భార్యను గొలుసులతో కట్టేశాడు. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. తన భార్య తరచూ ఇంటి బయటికి పోతుందని బదులిస్తున్నాడు. భార్య మాత్రం నన్ను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెడుతున్నాడంటూ చెబుతుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం పట్టణ పరిధిలోని బర్లిఫిట్‌కు చెందిన రషీద్, మంగ భార్యభర్తలు. భార్య తరచూ ఇంటి నుంచి బయటకు వెళుతుందని గొలుసులతో ఆమెను ఇంటిలోనే కట్టేశాడు. ఇది గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అసలు విషయం ఆరా తీసే ప్రయత్నం చేశారు.

    అయితే రషీద్ తన భార్య తరచూ ఇంటి నుంచి బయటకు వెళుతుందని గొలుసులతో కట్టేశానని చెబుతుండగా భార్య మాత్రం తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెడుతున్నాడంటూ చెబుతోంది. దీంతో పోలీసులు భార్య మంగను గొలుసుల నుంచి విడిపించి.. వారిద్దరనీ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Badradri, Police, Telangana

    తదుపరి వార్తలు