హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Murder Plan : భార్యను చంపేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు.. ఆ లాజిక్ మిస్సయ్యాడు

Murder Plan : భార్యను చంపేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు.. ఆ లాజిక్ మిస్సయ్యాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chennai crime news : హత్య చెయ్యాలి అనుకునేవాళ్లు... ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తారే తప్ప.. అవతలి వాళ్లు ఎలా తప్పించుకుంటారు అనే కోణం ఆలోచించేందుకు ఇష్టపడరు. అలా తన వైపు యాంగిల్ మాత్రమే ఆలోచించుకున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. ఎలాంటి ప్లాన్ వేశాడో తెలుసుకుందాం. ఇంతకీ అతను తన భార్యను ఎందుకు చంపాలనుకున్నాడు?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు అని ఓ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్లు.. ఈ కథలోనూ శత్రువు ఆమె ఇంట్లోనే భర్త రూపంలో ఉన్నాడు. అతనో కాలోజీలో టీచర్. పబ్లిక్‌గా భార్యను చంపేందుకు యత్నించిన అతన్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అదే ఈ క్రైమ్ స్టోరీలో పోలీసులు ఆశ్చర్యపోయేలా చేసింది.

అతని పేరు ఎం కుమారస్వామి. వయసు 50 ఏళ్లు. నందనం ఆర్ట్స్ కాలేజీలోని హిస్టరీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్. అతని భార్య జయవాణి. వయసు 38 ఏళ్లు. ఇద్దరికీ వయసులో 20 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ నుంచే అతనికి అనుమానం మొదలైంది. జయవాణి.. ఆమె వయసు ఉండే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది అని అనుకున్నాడు కుమారస్వామి. ఇందుకు ఏ ఆధారాలూ లేవు. కానీ అనుమానం పెనుభూతం అంటారు కదా.. అది అతని మెదడును తినేసింది. రోజురోజుకూ అతనిలో క్రూరమృగం రాటుదేలింది. చివరకు ఆమెను చంపేయాలి అని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం ఓ ప్లాన్ వేశాడు.

గురువారం సాయంత్రం జయవాణి... ఎగ్‌మోర్‌లోని ఆంగ్లో-ఇండియన్ క్వార్టర్స్ రోడ్ దగ్గర బస్సు దిగుతూ ఉంది. ఆ సమయంలో... ఓ బిచ్చగాడు ఆమె దగ్గరకు వచ్చాడు. సడెన్‌గా బ్లేడ్ తీసి.. ఆమె మెడను కసక్కున కోసేద్దామని యత్నించాడు. అంతలోనే అలర్ట్ అయిన ఆమె... చెయ్యి అడ్డు పెట్టుకోవడంతో.. చేతికి గాయమైంది. భయంతో ఆమె పరుగులు పెట్టింది. ఆమె వెంటపడిన బిచ్చగాడు మరిన్ని గాయాలు చేయడానికి యత్నించాడు.

రోడ్డుపై ఇదంతా జనం చూస్తుండటంతో బయపడిన బిచ్చగాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగిని అయిన జయవాణిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.

ఎగ్మోర్ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆమెను ఎంక్వైరీ చెయ్యగా... ఆ బిచ్చగాడు తన భర్తే అని చెప్పింది. అతను మారువేషంలో వచ్చినా తాను కనిపెట్టగలిగినట్లు తెలిపింది. పోలీసులు.. శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి... సాధారణ రూపంలో ఉన్న ఆమె భర్తను అరెస్టు చేశారు.

విద్యార్థినిగా ఉన్నప్పుడే జయవాణికి పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. ఆమెను పెళ్లి చేసుకున్న కుమారస్వామి.. ఆమె చదువుకి అయ్యే ఖర్చును భరించాడు. అతను ఆమె తండ్రికి ఫ్రెండ్. పెళ్లైన కొత్తలో బాగానే ఉండేవాడు... కాలం గడిచేకొద్దీ.. అతని తీరు మారింది. భార్యను అనుమానించి... చంపేయాలని దాడి చేసి.. జైలుపాలయ్యాడు.

First published:

Tags: Crime news, Tamil nadu

ఉత్తమ కథలు