ఆసుపత్రిలో నర్సుతో డాక్టర్ రాసలీలలు...భార్య అడ్డుగా ఉందని ఏం చేశాడంటే...

నర్సు జీనత్‌ను పెళ్లి చేసుకొని మరో కాపురం పెట్టాలని సైతం డాక్టర్ సూరజ్ కుట్రపన్నాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఆసుపత్రిలోనే పడకగది ఏర్పాటుచేసుకొని జీనత్‌తో కలిసి రాసలీలల్లో మునిగితేలేవాడు.

news18-telugu
Updated: February 21, 2020, 5:43 PM IST
ఆసుపత్రిలో నర్సుతో డాక్టర్ రాసలీలలు...భార్య అడ్డుగా ఉందని ఏం చేశాడంటే...
ప్రతీకాత్మకచిత్రం (Image: Facebook)
  • Share this:
కట్టుకున్న భార్య కంటే ప్రియురాలి ఇల్లే స్వర్గం అనుకున్నాడో భర్త.. అయితే తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉందని ఆమెను కడతేర్చాలని కుట్ర పన్నాడు. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాష్ట్రం చెందిన సూరజ్ (పేరుమార్పు)వృత్తిరీత్యా ఓ డాక్టర్, భార్య కుసుమ్(పేరుమార్పు)తో కలిసి జీవిస్తుండేవాడు. అయితే సూరజ్ తన ఆసుపత్రిలో పనిచేసే నర్స్ జీనత్(పేరుమార్పు)తో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. అవివాహిత అయిన నర్సు జీనత్‌ను పెళ్లి చేసుకొని మరో కాపురం పెట్టాలని సైతం డాక్టర్ సూరజ్ కుట్రపన్నాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఆసుపత్రిలోనే పడకగది ఏర్పాటుచేసుకొని జీనత్‌తో కలిసి రాసలీలల్లో మునిగితేలేవాడు. అంతేకాదు ఇంటి దగ్గర ఉన్న కుసుమ్ ను పట్టించుకునేవాడు కాదు. అయితే విషయం పసిగట్టిన కుసుమ్ తన భర్త అయిన సూరజ్ ను నిలదీసింది. చట్టపరంగా ముందుకు వెళతానని తేల్చిచెప్పింది. దీంతో తన రాసలీలలకు కుసుమ్ అడ్డుగా ఉందని భావించిన డాక్టర్, ఎలాగైనా తొలగించాలని భావించాడు. తాను మారిన మనిషినని కుసుమ్ ను నమ్మించాడు.

ఈ క్రమంలో ఒక రోజు కుసుమ్ జ్వరంతో ఇబ్బంది పడుతుంటే...ఆమెకు స్లో పాయిజన్ విషం ఇంజెక్ట్ చేశాడు. అయితే భర్తపై అనుమానం కలిగిన కుసుమ్ వెంటనే తన సోదరుడి ద్వారా మరో ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది, తన భర్త కుటిల యత్నాన్ని తిప్పిగొట్టింది. పోలీసులను ఆశ్రయించిన కుసుమ్, తన భర్త సూరజ్ హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. దీంతో పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు