Andhra Pradesh: కానిస్టేబుల్ నిర్వాకం.. మరో మహిళ కోసం పోలీసుల ఎదుటే భార్యను..!

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కృష్ణా జిల్లా (Krishna District)లో వివాహేతర సంబంధం కోసం భర్త.. భార్యను చంపేందుకు యత్నించాడు. పోలీసుల ఎదుటే ఘాతుకానికి పాల్పడ్డాడు.

  • Share this:
    భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడో కానిస్టేబుల్. అదనపు కట్నం పేరుతో భార్యను వేధిస్తున్న అతగాడు ఆమెను పుట్టింటికి పంపించి చిన్నింట్లోనే తిష్టవేశాడు. భర్త నిర్వాకాన్ని బయటపెట్టాలని చూసిన భార్యను చంపేందుకు కూడా వెనకాడలేదా భర్త.వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా వెంట్రపగడకు చెందిన గొరిపర్తి శ్రీనివాసరావు.. గుడివాడలోని అగ్నిమాపక శాఖ విభాగంలో ఫైర్ కానిస్టేబుల్ గా చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి గన్నవరం కొత్త పేట ప్రాంతానికి చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. కానీ కొన్నాళ్లకే తన అసలు రంగు బయటపెట్టిన శ్రీనివాసరావు.. అదను కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పుట్టింటి నుంచి మరో ఎకరం పొలం రాయించుకు రావాలంటూ ఆమెను పంపేశాడు. రెండేళ్లుగా భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా గన్నవరంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

    భార్యను పుట్టింటికి పంపి.. ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భర్తను పోలీసులకు పట్టించాలని భావించిన లక్ష్మి.., తన సోదరుడితో కలిసి పోలీసులను తీసుకెళ్లింది. మహిళతో కలిసి ఉన్న ఇంటి తలుపులు కొట్టింది. వెంటనే అప్రమత్తమైన అతడు భార్యతో పాటు పోలీసుల కళ్లలో కారం కొట్టి వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్యకు అన్యాయం చేయడమే కాకుండా తమ ఎదుటే హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శ్రీనివాసరావును రిమాండ్ కు తరలించారు.

    పెళ్లి సమయంలో భారీగా కట్నం ముట్టజెప్పినా అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నట్లు బాధితురాలు లక్ష్మీ తెలిపింది. తమ పుట్టింటివారు, పెద్దలు సర్ది చెప్పేందుకు యత్నించినా వేరే మహిళ మోజులో తనను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటివారు కూడా తన భర్తకే వత్తాసు పలికేవారని చెప్పింది. భర్తతో పాటు అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఫైర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నందున తనను ఎవరూ ఏం చేయలేరని చెప్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
    Published by:Purna Chandra
    First published: