Home /News /crime /

HUSBAND TORTURED WIFE OVER DOUBTING AFFAIR WITH HER UNCLE IN BANGALORE HSN

మేనమామపై రేప్ కేసు పెట్టిన వివాహిత.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం.. అడ్డంగా బుక్కయిన భర్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

’నా మేనమామ నాపై అత్యాచారం చేశాడు. పండుగకు సొంతూరు వెళ్లినప్పుడు నాపై దాడి చేశాడు. అతడిని అరెస్ట్ చేయండి‘.. అంటూ ఓ వివాహిత కేసు పెట్టింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. చివరకు భర్తే కటకటాల పాలయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    అనుమానం అనే పెనుభూతంతో రోజూ ఏదో ఒక మూల భార్యలపై భర్తలు దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. ఆ అనుమానంతోనే భార్యలను కడతేర్చేదాకా భర్తలు తెగిస్తున్నారు. ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మేనమామతో అక్రమ సంబంధం నడుపుతోందంటూ ఓ భర్త తన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. ఆమె శరీరంపై గాట్లు పెట్టాడు. ఆమె మర్మాంగాలపై కూడా పశువులా దాడి చేశాడు. గాయపరిచాడు. అంతేకాకుండా ఆ గాయాలకు మేనమామే కారణమని ఆమెతో పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించాడు. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి రావడంతో ఆ భర్త కటకటాల పాలయ్యాడు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    19 ఏళ్ల ఓ వివాహిత, కృష్ణయాణపాల్య అనే గ్రామానికి చెందిన తన మేనమామపై జనవరి 17న కేసు పెట్టింది. జనవరి 13న తన స్వగ్రామమైన బొమ్మణహళ్లికి పండుగకు వెళ్లినప్పుడు తన మేనమామ కూడా ఆ ఊరికి వచ్చాడనీ, ఎవరూ లేనిది చూసి తనపై అత్యాచారం చేశాడని ఆ రిపోర్టులో పేర్కొంది. కత్తితో బెదిరించి, శరీరంపై గాట్లు కూడా పెట్టాడనీ, తన మర్మాంగాలపై గాయాలు చేశాడని కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బొమ్మణహళ్లికి వెళ్లి విచారణ చేశారు. జనవరి 13న ఆమె మేనమామ అసలు ఆ గ్రామానికే రాలేదని పోలీసుల విచారణలో తేలింది. అదే సమయంలో గాయాల పాలయిన ఆమె బ్రోయింగ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది. పోలీసులు వెళ్లి అసలు నిజమేంటని నిలదీయడం, బంధువులు కూడా ఆ సమయంలో అక్కడ ఉండటంతో ఇక ఆమె నిజం చెప్పక తప్పలేదు.

    ’నా భర్తే నన్ను గాయపరిచాడు. మేనమామతో అక్రమ సంబంధం ఉందని అనుమాన పడుతూ ఉన్నాడు. నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. నా శరీరంపై, మర్మాంగాలపై గాయాలు కూడా అతడే చేశాడు. భర్త బెదిరింపుల వల్లే నేను మేనమామపై తప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది‘ అంటూ ఏడుస్తూ ఆ భార్య తన బంధువుల ఎదుట వాపోయింది. దీంతో బొమ్మణహళ్లి పోలీసులు ఆ భర్తను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాంట్ కు పంపారు. అతడిపై వేధింపుల కేసుతోపాటు, తప్పుడు కేసును పెట్టించినందుకు కూడా మరో కేసును పెట్టామని పోలీసులు వెల్లడించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు