తెలంగాణలో దారుణం.. భార్య ఒంటిపై ఇనుప చువ్వలతో వాతలు పెట్టి..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె బట్టలూడదీసి, ఇనుప చువ్వలతో వాతలు పెట్టి కర్కషంగా వ్యవహరించాడో క్రూరుడు. ఈ అమానవీయ ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.

  • Share this:
    తెలంగాణలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె బట్టలూడదీసి, ఇనుప చువ్వలతో వాతలు పెట్టి కర్కషంగా వ్యవహరించాడో క్రూరుడు. ఈ అమానవీయ ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. పట్టణానికి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు అన్యోన్యంగా సాగిన వారి దాంపత్యంలోకి అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. భార్యపై కట్టుకున్న భర్తే వికృత చేష్టలతో విరుచుకుపడేలా చేసింది. దాంతో భార్యను శారీరకంగా హింసించాడు ఆ కర్కోటకుడు. ఏమైందో ఏమో తెలీదు గానీ.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకొని, తరచూ వేధింపులకు గురి చేశాడు.

    చిత్రహింసలు పెడుతూ వచ్చాడు. రెండ్రోజుల క్రితం ఇనుప రాడ్డుతో తల పగులగొట్టాడు. ఓవైపు రక్తం కారుతున్నా కనికరించకుండా.. ఆమెను వివస్త్రను చేసి, ఒళ్లంతా ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు. ఆ ఘటన దృశ్యాలను 14 ఏళ్ల కుమారుడితో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. విషయం బయటికి పొక్కడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని.. ఆ వీడియో చూసిన పోలీసులే షాక్‌కు గురయ్యారు. బాధితురాలిని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: