Home /News /crime /

HUSBAND TORTURE OVER DOWRY HARASSMENT AND BURNED BY CIGARETTES AFTER SHOWING OBSCENE VIDEO TO HIS WIFE IN KARNATAKA BENGALURU PAH

పెళ్లైన ఐదునెలలకే ప్రియురాలికి టార్చర్... అశ్లీల వీడియోలు చూపిస్తు.. స్నేహితులతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka:  ఇద్దరు ప్రేమించుకుని, పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని నెలలకు భర్త టార్చర్ మొదలుపెట్టాడు. ప్రతిరోజు తాగోచ్చి భార్యను.. మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.

కొంత మంది పవిత్రమైన మూడు ముళ్ల బంధాన్ని అభాసు పాలు చేస్తున్నారు. పెళ్లికున్న గొప్పతనానికి మచ్చను తీసుకుస్తున్నారు. కొంత మంది మగాళ్లు.. కట్టుకున్న తమ భార్యలను (Female harassment)  వేధిస్తుంటారు. కొందరు అదనపు కట్నం తేవాలని, మరికొందరు నువ్వు మాకు నచ్చలేదని ఏదో ఒక వంకతో నిత్యం భార్యలను వేధిస్తుంటారు. కొంత మంది ప్రేమించి, పెళ్లి చేసుకుంటారు. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత.. తమ అసలు రంగులను బయటపెడుతుంటారు. మరికొందరు పెళ్లి చేసుకుని, భార్యలను నిత్యనరకం చూపిస్తుంటారు. తమ భార్యలకు అశ్లీల వీడియోలు చూపిస్తు.. స్నేహితులతో సంబంధం పెట్టుకోవాలని డబ్బుల కోసం ఎంతైన తెగిస్తారు. ఇలాంటి ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  అమానుష ఘటన జరిగింది. బెంగళూరులోని బనసవాడిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రదీప్ అనే యువకుడు.. 22 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత.. తన అసలు రంగును బయటపెట్టాడు. ఈ క్రమంలో కొన్ని నెలల తర్వాత.. భార్యకు టార్చర్ మొదలెట్టాడు. రోజు తాగి వచ్చేవాడు.



భార్యకు అశ్లీల వీడియోలు చూపేట్టేవాడు. సిగరెట్ తో కాలుస్తూ.. మానసికంగా, శారీరకంగాను హింసించేవాడు. డబ్బులు తేవాలని గొడవ పడేవాడు.  అంతేకాకుండా, స్నేహితులను ఇంటికి పిలిచి వారితో ఎఫైర్ పెట్టుకొవాలంటూ వేధించేవాడు. ఈ క్రమంలో భార్యకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. ఇతగాడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ప్రదీప్ ను అదుపులోనికి తీసుకున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు