వెనుక నుంచి వాటేసుకున్న మామ... సర్దుకుపోమంటూ భర్త...

ఓ రోజు బాత్‌రూమ్‌లో దుస్తులు ఉతుకుతుంటే మామ వచ్చి ఆమెను హత్తుకోపోబోయాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది.

news18-telugu
Updated: February 13, 2020, 9:38 PM IST
వెనుక నుంచి వాటేసుకున్న మామ... సర్దుకుపోమంటూ భర్త...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తనతో పాటు తన తండ్రిని కూడా సుఖపెట్టాలంటూ సొంత భర్త ఒత్తిడి చేస్తుంటే తట్టుకోలేక ఓ మహిళ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. బీహార్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాట్నా నగరానికి చెందిన ఓ మహిళ మహిళా కమిషన్‌కు తెలిపిన వివరాల ప్రకారం... ‘నా భర్త నా మీద ఒత్తిడి చేస్తున్నాడు. మామ ఇంకా యువకుడేనని, తనలాగే అతడిని కూడా సుఖపెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. ఆ పని చేయనని చెప్పినందుకు నన్ను కొడుతున్నాడు.’ అని తెలిపింది. 2012 సంవత్సరంలో ఆ మహిళకు ముజఫర్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ జాఫర్‌తో పెళ్లి జరిగింది. అనంతరం అత్తగారింట్లో కాపురం పెట్టింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అత్త చనిపోయింది. దీంతో భర్త, మామతో కలసి ఆమె నివసిస్తోంది. ఈ క్రమంలో, కొన్ని రోజుల తర్వాత పండుగ కోసం వెళ్లినప్పుడు తన భర్త అసలు విషయం బయటపెట్టినట్టు చెప్పింది. అదే సమయంలో ఓ రోజు బాత్‌రూమ్‌లో దుస్తులు ఉతుకుతుంటే మామ వచ్చి ఆమెను హత్తుకోపోబోయాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే, ఆయన కూడా వయసులోనే ఉన్నాడన,ి మామను కూడా సుఖ పెట్టాలని తన భర్త ఒత్తిడి చేయడం మొదలు పెట్టారని ఆరోపించింది.

First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు