Husband Kills Wife: భార్యను ఈ కారణంతో చంపిన మొట్టమొదటి భర్త వీడేనేమో.. ఎందుకు చంపాడంటే..

గీత, లోకేశ్

కనకపుర పట్టణానికి చెందిన లోకేశ్‌కు మాత్రం కులం విషయంలో పట్టింపులెక్కువ. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కానీ ఆ యువతిది తన కులమే అయి ఉండాలన్నది లోకేశ్ సిద్ధాంతం. ఇలాంటి ఆలోచనలున్న లోకేశ్‌కు హావేరి జిల్లా హానగల్లు తాలూకా ఓంకణ గ్రామానికి చెందిన గీతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది.

 • Share this:
  కనకపుర: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ బాబు కూడా పుట్టాడు. అందమైన భార్య. ఆశించిన విధంగానే జీవితం. అంతా బాగుందనుకున్న క్రమంలో భర్త కులపిచ్చి భార్య ప్రాణం తీసింది. కులం విషయంలో భార్య అబద్ధం చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో ఆమెను చంపి గోనెసంచిలో కట్టి తన తాతకు చెందిన పొలంలో పూడ్చి పెట్టాడీ ప్రబుద్ధుడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని కనకపుర పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రేమకు కులం, మతంతో పనిలేదంటుంటారు. చాలా ప్రేమ జంటలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. కానీ.. కనకపుర పట్టణానికి చెందిన లోకేశ్‌కు మాత్రం కులం విషయంలో పట్టింపులెక్కువ. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కానీ ఆ యువతిది తన కులమే అయి ఉండాలన్నది లోకేశ్ సిద్ధాంతం. ఇలాంటి ఆలోచనలున్న లోకేశ్‌కు హావేరి జిల్లా హానగల్లు తాలూకా ఓంకణ గ్రామానికి చెందిన గీతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే.. గీత కూడా.. మీ కులానికి చెందిన యువతినే అని చెప్పడంతో ఆ ప్రేమ కాస్తా ఏడడుగుల బంధానికి దారితీసింది. గీత, లోకేశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారి దాంపత్య బంధానికి గుర్తుగా బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆ పిల్లాడి వయసు ఒక సంవత్సరం. భార్యాకొడుకుతో కలిసి ఆనందంగా ఉండాల్సిన లోకేశ్‌కు ఈ మధ్య భార్య కులం విషయంలో అనుమానం మొదలైంది. తన భార్య కులం విషయంలో అబద్ధం చెప్పిందని.. ఆమెది తన కులం కాదని భావించిన లోకేశ్ తన భార్య తనను మోసం చేసిందని భావించాడు. సైకోలా మారాడు. జూన్ 1న ఈ విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కులం ఏదైతే ఏంటని, పిల్లాడితో కలిసి సంతోషంగానే గడుపుతున్నాం కదా అని భార్య ఎంత చెప్పినా లోకేశ్ వినలేదు. ఆమెతో ఘర్షణకు దిగాడు. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. లోకేశ్‌లో ఉన్న సైకో నిద్రలేచాడు. గీత మెడకు తాడుతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి భార్య ప్రాణం తీశాడు.

  ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం.. ఆమె శవాన్ని గోనె సంచిలో కట్టి పట్టణ శివారులోని తన తాతకు చెందిన పొలంలో గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాడు. తాను చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త కథ అల్లాడు. గీతను హత్య చేసిన మరుసటి రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌కు కావాలని వెళ్లిన లోకేశ్ తన భార్య ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తీసుకుని వేరొకరితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా గీత తల్లిదండ్రులను కూడా విచారించారు. వారు అల్లుడు లోకేశ్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

  ఇది కూడా చదవండి: Wife Chunni: ఏ భర్తకూ ఇలాంటి చావు రాకూడదు.. భార్య మెడలో చున్నీనే భర్తకు యమపాశమైంది..!

  పోలీసులు లోకేశ్‌ను తమకు తెలిసిన రీతిలో విచారణ జరపగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. గీతను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులకు గీత శవాన్ని ఎక్కడి పూడ్చి పెట్టాడో చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసిన పోలీసులకు గీత మృతదేహం కనిపించింది. గీత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యను చంపిన కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: