హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: 52 ఏళ్ల వయసులో దానికోసం భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య

Andhra Pradesh: 52 ఏళ్ల వయసులో దానికోసం భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయన వయసు 52 ఏళ్లు.. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ భార్య పిల్లలు కావాలని ఒత్తిడి తెచ్చేది. ప్రతి నిత్యం దాని కోసమే ఇద్దరి మధ్య గొడవ జరిగేది.. ఆ వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

  పెళ్లికి వయసు అడ్డంకి కాదేమో కాని.. 40 ఏళ్ల తరువాత సంతానం అంటే కాస్త కష్టమే.. 40 ఏళ్లలోపే అంతా సంతానం కోసం ప్లాన్ చేసుకుంటారు.. పిల్లలు పుట్టని వాళ్లు మాత్రమే 40 ఏళ్ల తరువాత కూడా పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తు ఉంటారు. అయితే ఓ 52 ఏళ్ల వ్యక్తికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అతడి భార్య తనకు అర్జెంటుగా సంతానం కావాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలు వారితోనే సరిపెట్టుకో అన్న ఆమె అందుకు నో.. తనకు సంతానం కావాలంటూ రోజూ ఒత్తిడి తెచ్చేది.. తరుచూ ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.. మనస్పర్థలు పెరిగాయి. నిత్యం ఆమె సంతానం కోసం పోరు పెడుతుండేది. ఆయన ఎంత నచ్చ చెప్పినా ఆమె మాత్రం తనకు సంతానం కచ్చితంగా కావాలంటూ పట్టు పట్టడంతో ఏం చేయాలో తెలియని ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళంలోని మెరక వీధిలో నివాసం ఉంటున్న52 ఏళ్ల బత్తుల భాస్కరరావు ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయనకు 22 ఏళ్ల కిందట సోంపేటకు చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే గతేడాది జరిగిన బైక్ ప్రమాదంలో ఆమె మరణించింది. వీరికి ఇంజినీరింగ్ సెకెండ్ ఇయర్ చదువుతున్న కుమారుడు.. పో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. కానీ భార్య లేకపోవడం.. పిల్లల ఆలనా పాలన చూసుకోవడం కోసం గతేడాది జూన్ 25న ఈయన ఒడిశాలోని రాయగకు చెందిన వెంకటరత్నంను రెండో పెళ్లి చేసుకున్నాడు..

  పెళ్లైన కొన్నేళ్ల నుంచి ఆమె వారి మధ్య వయసు అంత వ్యత్యాసం ఉన్నా.. తనకు సంతానం కావాలని రోజు భర్తను కోరేది. ఈ వయసులో కష్టమని అతడు చెప్పే ప్రయత్నం చేసేవాడు. అయినా ఆమె మాత్తరం నకు సంతానం కావాల్సిందే అంటూ పట్టు పట్టింది. ప్రతి రోజు రాత్రి అయ్యే సరికి ఆమె తనకు సంతానం కావాలని ఆయన్ను డిమాండ్ చేసేది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చాలు అంటూ చెబుతూ ఉండేవారు. 

  ఇలా వారి మధ్య సంతానం కోసం తరచూ గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ ఇదే విషయంలో వాదించుకున్నారు. మంగళవారం ఉదయం చూసేసరికి భాస్కరరావు ఇంటి పెరటిలో ఉన్న బావిలో శవమై తేలి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తల్లి మహలక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Husband, Srikakulam

  ఉత్తమ కథలు