Kakinada: భర్తకు బ్లాక్ ఫంగస్ సోకింది.. భర్త బతకడేమోనన్న భయంతో భార్య క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది..!

ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బుల్లిమావతి

జి.మామిడాడ గ్రామానికి చెందిన సబెళ్ల తిరుపరెడ్డి, బుల్లిమావతి దంపతులు కరోనా బారిన పడ్డారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరే స్తోమత లేక కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఇద్దరూ కరోనాకు చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడటంతో గండం గడిచిందనుకున్నారు.

  • Share this:
    కాకినాడ: ప్రజలు కరోనా నుంచి పూర్తిగా కోలుకోక ముందే బ్లాక్ ఫంగస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న మరణాలు భయపెడుతుంటే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుండటం ఒకింత ఆందోళన కలిగించే విషయం. తూర్పుగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం చేరిన ఓ కుటుంబంలో బ్లాక్ ఫంగస్ కల్లోలం రేపింది. జి.మామిడాడ గ్రామానికి చెందిన సబెళ్ల తిరుపరెడ్డి, బుల్లిమావతి దంపతులు కరోనా బారిన పడ్డారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరే స్తోమత లేక కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఇద్దరూ కరోనాకు చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడటంతో గండం గడిచిందనుకున్నారు. కానీ.. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన రోజుల వ్యవధిలోనే మరోసారి తిరుపరెడ్డి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో.. మే 20న మరోమారు తిరుపరెడ్డిని అతని భార్య కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది. అతనికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తిరుపరెడ్డికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతనిని బ్లాక్ ఫంగస్ వార్డుకు మార్చారు. కరోనా నుంచి గట్టెక్కిన తన భర్తను బ్లాక్ ఫంగస్ కబళిస్తుందేమోనని తిరుపరెడ్డి భార్య తీవ్రంగా మదనపడింది. బ్లాక్ ఫంగస్ సోకితే చికిత్సకు భారీగా ఖర్చవుతుందని వాళ్లూవీళ్లూ చెప్పిన మాటలు ఆమెను మరింత కుంగదీశాయి. లక్షలు ఖర్చు పెట్టినా బతికే అవకాశాలు తక్కువేనని ఆసుపత్రిలో కొందరు చెప్పడంతో ఆ మాటలకు బెంబేలెత్తిపోయిన తిరుపరెడ్డి భార్య బుల్లిమావతి ఎంతో బాధపడింది.

    బ్లాక్ ఫంగస్ తన భర్తను బలి తీసుకోవడం ఖాయమని, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించే స్తోమతకు తమకు లేదని భావించిన బుల్లిమావతి క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. భర్తకు తోడుగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న బుల్లిమావతి బుధవారం ఉదయం తన భర్త ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తన భర్త చనిపోవడం ఖాయమని భావించి.. ఆస్పత్రి ఆవరణలో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

    ఇది కూడా చదవండి: Young Girl: ఎంతపని చేశావ్ అనూష... ఆ సంబంధం కాకపోతే దాని బాబు లాంటి సంబంధం వచ్చేదేమో..!

    ఆసుపత్రి సిబ్బంది చూసేలోపే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భర్త బ్లాక్ ఫంగస్‌తో చనిపోతాడేమోనన్న భార్య అనుమానం ఆమె ప్రాణాలనే బలి తీసుకోవడం శోచనీయం. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుల్లిమావతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: