పీటలపై భార్య పెళ్లిని అడ్డుకున్న యువకుడు...

న్యాయవాది, ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను తీసుకుని ఆ యువకుడు తన భార్యకు పెళ్లి జరుగుతున్న మండపానికి వెళ్లాడు.

news18-telugu
Updated: April 28, 2019, 7:26 PM IST
పీటలపై భార్య పెళ్లిని అడ్డుకున్న యువకుడు...
మరికొన్ని సంప్రదాయాల్లో తాళి కట్టడం ఉండదు. తాళిని మెడలో వేస్తారు.
  • Share this:
తన భార్యకు ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి జరిపిస్తున్నారంటూ ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కొమురం భీం జిల్లాలో ఈ ఘటన జరిగింది. సంజీవ్ అనే యువకుడు ఎస్‌ఐ చంద్రభాను కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2018 మార్చి 4న వారిద్దరూ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. తన భార్యను కిడ్నాప్ చేశారంటూ సంజీవ్ కోర్టును ఆశ్రయించాడు. సంజీవ్‌కు అతని భార్యను వెతికి పెట్టాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇంతలోనే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేస్తున్నారనే విషయం సంజీవ్‌కు తెలిసింది. విషయం తెలుసుకున్న సంజీవ్ పోలీసులు, ఓ న్యాయవాదిని తీసుకుని పెళ్లి మండపానికి వచ్చారు. తన భార్యకు బలవంతంగా జరుపుతున్న పెళ్లిని ఆపాలంటూ డిమాండ్ చేశాడు. అయితే, పెళ్లిని అడ్డుకున్నందుకు తమ మీద యువతి తరఫు బంధువులు దాడి చేశారని వారు ఆరోపించారు.
First published: April 28, 2019, 7:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading